సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినిమాను మించిన మలుపులు చోటు చేసుకుంటున్నాయి.విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు పోలీసులనే షాక్ కు గురి చేస్తున్నాయి.
శ్రావణి సాయి, దేవరాజ్ తో సన్నిహితంగా ఉండేదని… ఇద్దరితో ప్రేమాయణమే ఆమె కొంప ముంచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మొదట సాయిని ప్రేమించిన శ్రావణి ఆ తర్వాత దేవరాజును ఇష్టపడినట్టు తెలుస్తోంది.
శ్రావణి ఆత్మహత్య కేసులో ఎన్నో ఊహించని ట్విస్టులు ఉన్నాయి.దేవరాజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వీడియాలో శ్రావణి దేవరాజ్ ను మై లవ్ లీ హీరో అని సంబోధించడం గమనార్హం.
అయితే శ్రావణి దేవరాజ్ వల్ల చనిపోయిందా…? సాయి వల్ల చనిపోయిందా…? అనే విషయం తేలాల్సి ఉంది.ఇప్పటికే దేవరాజ్ పోలీసులకు లొంగిపోగా ఆదివారం సాయి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకున్నాడు.
మరోవైపు శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి ముందురోజు రాత్రి సాయి, శ్రావణి మధ్య గొడవ జరిగిందని… సాయి శ్రావణిని బెదిరించడంతో పాటు ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడని తేలింది.సాయి రోడ్డు మీదే గొడవ చేయడం శ్రావణి ఆటో ఎక్కింది.
శ్రావణి ఆత్మహత్యకు ముందు రోజు దేవరాజ్, సాయి గొడవ పడ్డారు.ఫోన్ కాల్ లో శ్రావణికి తానే కావాలంటూ దేవరాజ్ సాయికి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
సాయి దేవరాజ్ తో ఐదు సంవత్సరాల నుండి తాను ప్రేమిస్తున్నానని… ఇద్దరి మధ్యలో నువ్వు వచ్చావని దేవరాజ్ పై విమర్శలు చేశాడు.అనంతరం దేవరాజ్ కాన్ఫరెన్స్ కాల్ కలిపి శ్రావణిని తమ ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నావని అడగగా దేవరాజ్ నే ప్రేమిస్తున్నానని తెలిపింది.
అయితే శ్రావణి కేసులో హీరో ఎవరు…? విలన్ ఎవరు.? అనే ప్రశ్నకు సమాధానం లభించాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.పోలీసులు శ్రావణి ఆత్మహత్య గురించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.