సీనియర్ నటుడు నరేష్ రమ్య రఘుపతి మధ్య విభేదాలకు సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే కొన్నిరోజుల క్రితం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలిచిన రమ్య మళ్లీ సైలెంట్ అయ్యారు.
అయితే నరేష్ రమ్య రఘుపతి మధ్య వివాదం మరింత పెద్దదైందని తెలుస్తోంది.సీనియర్ నరేష్ రమ్య వల్ల తనకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించారు.
కర్నాటకకు చెందిన రౌడీతో రమ్య రఘుపతి తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు.తన ఫోన్ హ్యాక్ అయిందని ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో రమ్య ఫోన్ ను హ్యాక్ చేసిందని ఆయన పేర్కొన్నారు.10 కోట్ల రూపాయలతో సెటిల్మెంట్ చేసుకుందామని రమ్య రఘుపతి మధ్యవర్తి ద్వారా సీనియర్ నరేష్ దగ్గర ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది.

మాజీ మంత్రి రఘువీరారెడ్డి రమ్యకు బంధువు అనే సంగతి తెలిసిందే.ఆయన పేరు చెప్పి రమ్య రఘుపతి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.రమ్య రఘుపతికి తనపై ప్రేమ లేదని తన కంటే డబ్బులు అంటేనే ఆమెకు ఎక్కువగా ఇష్టమని నరేష్ అన్నారు.
ఏదైనా ఫంక్షన్ కు రమ్య రఘుపతితో వెళితే ఆమె అక్కడ డ్రింక్ చేసి రచ్చరచ్చ చేసేదని ఆయన చెప్పుకొచ్చారు.

రమ్య రఘుపతి కొడుకును కొట్టేదంటూ నరేష్ సంచలన ఆరోపణలు చేశారు.ఆమె సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదని నరేష్ పేర్కొన్నారు.పెళ్లి జరిగిన కొన్నిరోజుల తర్వాత తనపై ఆమె వేధింపులు మొదలుపెట్టిందని నరేష్ చెప్పుకొచ్చారు.
నరేష్ ఆరోపణల విషయంలో రమ్య రఘుపతి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.నరేష్ రమ్య రఘుపతి మధ్య నెలకొన్న వివాదాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
పవిత్ర లోకేశ్ వల్లే తమ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని రమ్య రఘుపతి చెబుతున్నారు.
