Hit 2 nani : హిట్ 3ని దేవుడే కాపాడాలంటూ నానిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్?

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా తాజాగా విడుదల అయ్యి మంచి హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

 Shocking Trolls On Hero Nani God Should Save Hit Series Hot Topic In Tollywood N-TeluguStop.com

ఈ సినిమాని ఏడు సిరీస్‌లుగా తీసుకురాబోతున్నారనే అంశాలు మరింత హైప్‌ తీసుకొచ్చాయి.ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ లో హిట్ 3 సినిమా కూడా ఉండబోతుందని ఆ సినిమాలో నాని హీరోగా నటించబోతున్నాడని ప్రకటించిన విషయం తెలిసిందే.

థర్డ్ కేసు గురించి చెబుతూ హిట్ 3 సినిమాలోని సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్‌ ఓ రేంజ్‌లో చూపించారు.దీంతో థియేటర్లు హోరెత్తిపోయాయి.

అప్పటివరకు బాగానే ఉన్న నానిని హీరోగా చూపించిన తర్వాత అసలు సమస్య స్టార్ట్ అయ్యింది.నాని ఒక మంచి నటుడు.

ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాచురల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.నాని యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కానీ థ్రిల్లర్ సినిమాలకు నాని సెట్ కారు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హిట్ 3 సినిమాకి హీరోగా నాని సెట్ కాడని, ఇక హిట్‌ సినిమాని ఆ దేవుడే కాపాడాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అదే విషయాన్ని వెల్లడిస్తూ నానిని ట్రోల్‌ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Telugu Adavi Shesh, Nani, Tollywood, Trolls-Movie

అయితే నాని ఇటీవలే వీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఆ సినిమా పరవాలేదు అనిపించినప్పటికీ నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి.కానీ అటువంటి పాత్రలో నానిని చూడలేకపోయారు అభిమానులు.దీంతో ఊహించని విధంగా వీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత నాని నటించిన టక్కు జగదీష్ సినిమాలో కూడా సీరియస్ పాత్రలో నటించాడు.నటనకు మంచి మార్కులే తెచ్చుకున్నప్పటికీ ఆ పాత్రలో కూడా నానిని ఊహించుకోలేకపోయారు అభిమానులు.

అయితే నాని సినిమా అంటే ఫన్నీ సీన్లు అమాయకు ఎక్స్ప్రెషన్స్ లవ్ కామెడీ, ఫ్యామిలీ తరహా ఎంటర్టైన్మెంట్ లాంటి సినిమాలను మాత్రమే అభిమానులు కోరుకుంటున్నారని తెలుస్తోంది.అంతేకాకుండా నాని ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కూడా అదే విధంగా ఉండడంతో తదుపరి సినిమాలలో కూడా నాని అదే విధంగా చూడాలి అనుకుంటున్నారు అభిమానులు.

మరి ఈ విషయంపై హీరో నాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube