ప్రగ్యా జైస్వాల్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Shocking Things About Pragya Jaiswal Going Viral On Social Media

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా చాలామంది కంచె సినిమా ఆమె మొదటి సినిమా అని భావిస్తున్నారు.

 Shocking Things About Pragya Jaiswal Going Viral On Social Media-TeluguStop.com

సోషల్ మీడియాలో గ్లామరస్ గా కనిపించే హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు.అయితే ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఒక విషయం తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

కంచె సినిమాతో ప్రేక్షకుల్లో ప్రగ్యా జైస్వాల్ కు మంచి గుర్తింపు దక్కింది.కంచె మూవీలో క్రిష్ ప్రగ్యా జైస్వాల్ ను అందంగా చూపించడంతో పాటు ప్రగ్యా జైస్వాల్ అభినయం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

 Shocking Things About Pragya Jaiswal Going Viral On Social Media-ప్రగ్యా జైస్వాల్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కంచె సినిమాలో నటనకు ప్రగ్యా జైస్వాల్ కు అవార్డులు కూడ దక్కడం గమనార్హం.అయితే ప్రగ్యా జైస్వాల్ కంచె మూవీలో నటించక ముందే రెండు సినిమాలలో నటించారు.

అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రగ్యాకు పేరు రాలేదు.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Dega, Pragya Jaiswal, Tollywood-Movie

ప్రగ్యా జైస్వాల్ తెలుగులో నటించిన తొలి సినిమా డేగ కాగా ఈ సినిమా ఎప్పుడు విడుదలైందనే సంగతి కూడా చాలామంది అభిమానులకు తెలియదు.డేగ తర్వాత మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో ప్రగ్య నటించగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.అయితే ఈ సినిమాల వల్ల క్రిష్ దృష్టిలో పడిన ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలను అందుకున్నారు.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Dega, Pragya Jaiswal, Tollywood-Movie

బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయకి సినిమాలో నటించిన ప్రగ్య జైస్వాల్ కు బోయపాటి శ్రీను అఖండ మూవీలో ఛాన్స్ ఇచ్చారు.అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ దశ మారుతుందేమో చూడాల్సి ఉంది.ప్రగ్య కెరీర్ విషయంలో, సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

#Balakrishna #Pragya Jaiswal #Akhanda #Dega #Boyapati Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube