పొలం పనులు అంటేనే ఎంతో కష్టంతో కూడుకున్నవి.పొలం దగ్గర ఏవో ఒక జంతువులు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి.
పందులు లేదంటే పాములు, కోతులు లాంటివి దర్శనమిస్తూనే ఉంటాయి.ఇక అప్పడప్పుడు పొలాల దగ్గర చాలా వింతలు కూడా కనిపిస్తుంటాయి.
ఇక ఇప్పుడు కూడా ఓ రైతుకు ఇలాంటి షాక్ తగిలింది.అదేంటంటే ఆయన ఎ్పటిలాగే తన పొలంలో నాట్లు వేయించడానికి కూలీలు తీసుకుని వచ్చాడు.
ఇక నాటు వేసేందుకు వారంతా కూడా పొలంలోకి దిగుదామనుకుని ముందుకు వెళ్లడంతో ఆ పొలం యజమానికి షాకింగ్ వంత కనిపించింది.
ఏపీలోని అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలంలానికి చెందినటువంటి గుర్రబ్బాడు ఊరులో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
ఈ గ్రామానికి చెందినటువంటి రామాంజనేయులు ఎప్పటిలాగే తన పొలంలో నాటు వేసేందుకు రెడీ అయ్యాడు. ఇక నాటు వేసిన పొలానికి పురుగు పట్టకుండా మందు కడూఆ పిచికారీ చేసి నీళ్లు నింపాడు.
కాగా ఇక పనులు సాగుతు్న క్రమంలో ఆయన రెండు రోజుల తర్వాత పొలం దగ్గరకు వెళ్లాడు.ఇక పొలంలో ఆయనకు చాలా వరకు పాములు గుంపులుగా చచ్చిపోయి నీటిమీద తేలియాడుతూ కనిపించాయి.

ఇది చూసిన ఆయన షాక్ తిన్నారు.ఇక నారుమడిలో ఎక్కడ చూసినా గుంపులు, గుంపులుగా పాములు చనిపోయి ఉన్నాయి.ఈ పాములు అయితే సాధారణంగా చీమలు గుంపులు, గుంపుల మాదిరిగా ఉండటంతో ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయో ఆయనకు అర్థం కాలేదు.ఇక మరికొన్ని ఉన్నాయేమో అని నీటిని బయటికి తోడాడు.
దాంతో అతడు అనుకున్నట్టు గానే ఆ నారుమడి లోంచి చాలా వరకు బ్రతికున్న పాములు కూడా వచ్చాయి.దీంతో కొందరు స్థానికులు వచ్చి వాటిని పొలం నుంచి వెళ్లగొట్టి చంపేశారు.
ఇప్పుడు ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.