ప్రభాస్ కు కాబోయే భార్య ఆమేనంట.. నిజమవుతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్, వెబ్ మీడియాలో ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.ప్రభాస్ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారని, గోదావరి జిల్లాలకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది.

 Once Again Shocking Rumours About Prabhas Marriage, Prabhas Marriage, Krishnam R-TeluguStop.com

అయితే ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన వార్తలేవీ నిజం కాలేదు. బాహుబలి 2 సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి అని వార్తలు వచ్చినా ప్రభాస్ పెళ్లి మాత్రం జరగలేదు.

ప్రభాస్ పెళ్లి కోసం ఆయన అభిమానులు కూడా అసక్తిగా ఎదురు చూస్తున్నారు.వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్న ప్రభాస్ ఈ ఏడాది వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

అయితే ప్రభాస్ పెళ్లికి సంబంధించి మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.కృష్ణంరాజు భార్య సన్నిహితుల కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని.

ఆ అమ్మాయిది పశ్చిమ గోదావరి జిల్లా అని ప్రచారం జరుగుతోంది.

Telugu Salaar, Aadipurush, Krishnam Raju, Nri, Rumours Prabhas, Prabhas Fans, Pr

2021 సంవత్సరం చివరలో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని.ప్రభాస్ కు కాబోయే భార్య, కుటుంబ సభ్యులు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారని.అమ్మాయి కుటుంబ సభ్యులకు సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర వ్యాపారాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్త నిజమవుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.గతంలో ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన వార్తలు నిజం కాకపోవడంతో ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలను ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నమ్మడం లేదు.

మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలకు డేట్స్ కేటాయించి ఆ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కూడా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని సమాచారం.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఈ ఏడాది విడుదల కానుండగా 2021 సంక్రాంతి టార్గెట్ గా సలార్ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube