పెళ్లి కోసం ఆ పని చేస్తున్న అనుష్క..?

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని ఫిమేల్ డామినేషన్ తక్కువగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తుంటాయి.అయితే కొందరు హీరోయిన్లు మాత్రం తమ టాలెంట్ తో అలాంటి మాటలు నిజం కాదని టాలెంట్ ఉంటే మేల్ హీరోలతో సమానంగా ఫిమేల్ హీరోయిన్లు సక్సెస్ లు సొంతం చేసుకోగలరని ప్రూవ్ చేశారు.

 Shocking Rumours On Heroine Anushka Shetty Marriage, Anushka Shetty, Anushka Mar-TeluguStop.com

అలా అరుంధతి, భాగమతి సినిమాలతో భారీ విజయాలను అందుకుని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

దశాబ్ద కాలం క్రితమే హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అనుష్కకు అవకాశాలు తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతున్నాయి.అటు అందానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలలో అభినయంతో మెప్పించడం అనుష్క ప్రత్యేకత.2005 సంవత్సరంలో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న నిశ్శబ్దం సినిమా వచ్చే నెల 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న తొలి ఓటీటీ చిత్రం నిశ్శబ్దం.

ఈ సినిమాలో వినికిడి లోపంతో పాటు మాట్లాడలేని అమ్మాయి పాత్రలో అనుష్క నటించారు.నవ్యత ఉన్న కథలను ఎంచుకుంటున్న అనుష్క నిశ్శబ్దం తరువాత మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

పెళ్లి కోసమే అనుష్క కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం అనుష్క వయస్సు 38 సంవత్సరాలు.

దీంతో అనుష్క పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చి సినిమాలను ఎంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది.అనుష్క కుటుంబ సభ్యులు కూడా ఆమెను త్వరగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం.

అనుష్క వదిన వాళ్ల దగ్గరి బంధువులలో ఒకరితో అనుష్క వివాహం జరగబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అనుష్క ఈ విషయం గురించి స్పందించాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube