ఉత్తరాఖండ్ ప్రమాద ఘటనలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్.. ?

మనిషి తన మేధస్సుతో ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడటం అసాధ్యమన్న విషయం ప్రతి సారి నిరూపించబడుతుంది.ఇక తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.

 Uttarakhand, Nanda Devi Peak, Radio Active Device, Raini Village, Viagers Suspec-TeluguStop.com

ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతు అవ్వగా 31 మంది మృతి చెందారు.అయితే ఈ విపత్తుకు గ్లేసియర్ బరస్ట్ కారమని అంతా భావించారు.

కానీ మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది.అదేమంటే.

నందాదేవి శిఖరంపై సుమారుగా 56 ఏళ్ల కిందట పరిశీలనకు వెళ్లిన అధికారుల బృందానికి ఊహించని ప్రమాదం ఎదురవడంతో వారు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఆ రేడియో యాక్టివ్ డివైజ్‌ను అక్కడే వదిలేశారట.

కాగా తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ పరికరం కోసం అధికారులు మరుసటి సంవత్సరం అక్కడికి వెళ్లగా ఈ రేడియో యాక్టివ్ పరికరం మాత్రం కనిపించకుండా పోయిందని ఇక్కడి గ్రామస్థులు తెలుపుతున్నారు.ఇక ఈ ప్రమాదానికి రేడియో యాక్టివ్ డివైజ్ కారణమా లేక మరేదైనా ఇంకో కారణం ఉందా అని మరింత లోతుగా పరిశోధన చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube