రాజకీయాల్లోకి ప్రభాస్.. అందుకే ఇంకా పెళ్లి చేసుకోకుండా?

తెలుగు తెరపై స్టార్ హీరోగా ఉన్నటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా స్థాయి హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తెలుగులో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయిందని చెప్పవచ్చు.

 Shocking News On Prabhas Political Entry, Shocking News, Prabhas, Tollywood, Pol-TeluguStop.com

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎంతో స్టార్డం తెచ్చుకుని చాలామంది హీరోలు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఉంటూ రాజకీయాలలో రాణించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు.

అయితే ఓ సందర్భంలో ప్రభాస్ కు ఇలాంటి ప్రశ్న ఎదురయింది.రాజకీయాలలోకి రాబోతున్నారా అన్న ప్రశ్న ఎదురుకాగా ప్రభాస్ ఎవరూ ఊహించనటువంటి సమాధానాన్ని తెలియజేశారు.

ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మొగల్తూరు ఎంపీగా ఉన్నప్పుడు తనలో సహనం అనేది వచ్చింది.ఎందుకంటే నెల రోజుల పాటు మొగల్తూరు బాధ్యతలను తీసుకున్న తనకు ప్రతి రోజు ఎంతో మంది వచ్చి తమ సమస్యలను పార్టీ గొడవలను తెలియజేసేవారు.

ఇలా వారి సమస్యలు చెప్పినప్పుడు వారికి ఏ సమాధానం చెప్పాలో అర్థం అయ్యేది కాదు.రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన లేకపోవడంతోనా వల్ల ఒక్క ఓటు కూడా రాదని, కనీసం ఓట్లు రాకపోయినా ఓట్లు పడిపోకుండా ఉండాలని వారి సమస్యలన్నింటినీ ఎంతో ఓపిగ్గా వినేవాడిననీ తెలిపారు.

Telugu Prabhas, Tollywood-Movie

నెల తర్వాత పెదనాన్న గారికి నమస్కారం పెట్టి మీ రాజకీయ గొడవలు నాకొద్దు.ఇంకోసారి రాజకీయాల గురించి నాకు చెప్పకు.జీవితంలో రాజకీయాల వైపు రానని రాజకీయాలకు ఒక నమస్కారం అంటూ ప్రభాస్ రాజకీయ ఎంట్రీ గురించి ఈ ఇంటర్వ్యూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలు తనకు సెట్ కావని అందుకే రాజకీయాల వైపు రాను అని తేల్చి చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే బాహుబలి తర్వాత అద్భుతమైన విజయాన్ని అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం నాలుగైదు వరుస సినిమాలతో తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube