“మోడీ” కనుసన్నల్లో.. “ఏపీ సచివాలయం”       2018-04-22   04:16:13  IST  Bhanu C

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయాలకి అనుగుణంగానే ఆ రాష్ట్ర పరిపాలన విభాగం ఉంటుంది..ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగానే ప్రవర్తిస్తుంది..ప్రభుత్వం తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలని ఎంతో గోప్యంగా ఉంచుతూ ప్రభుత్వ ఎదుగుదలకి ఎంతో దోహద పడుతుంది.. ఏ రాష్త్రంలో అయినా లేక దేశంలో అయినా సరే ఈ పద్దతే కొనసాగుతుంది..ఎంతో నమ్మకమైన రాష్ట్ర ప్రయోజనాలకి సంభందిచిన అనేక కీలక విషయాలు ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది అయితే

ఏపీ సచివాలయంలో వివిధశాఖాధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నవారిలో కొందరు నిత్యం పిఎంఒ అధికారులతో మాట్లాడుతున్నారని, కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ విషయాలను చేరవేస్తున్నారని…మరి కొందరు రిటైర్డ్‌ సిఎస్‌ ఐ.వై.ఆర్‌.కృష్ణారావుతో మాట్లాడుతున్నారని సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది..నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ… ముక్కుసూటిగా వ్యవహరిస్తూ…ఎలాంటి బలహీనతలు లేని..అధికారులపై కూడా ఈ విధమైన ప్రచారం ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు మోడీ కి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి కూడా.. అంతేకాదు మాజీ సీఎస్ ఐవైఆర్ కి ఎప్పటికప్పుడు సిఎంవో నుంచీ వార్తలు వెళ్తున్నాయట..అయితే తాజాగా మాజీ సిఎస్‌ ‘అజయ్‌కల్లం’ కూడా చంద్రబాబును తప్పుపట్టడం..వెనుక ఈ ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది..అంతేకాదు కల్లంకు అత్యంత సన్నిహితంగా మెలిగి…కలసి పనిచేసిన అధికారి ఒకరు నిత్యం ఆయనకు సమాచారం చేరవేస్తున్నారని..సచివాలయం మొత్త కోడై కూస్తోంది… కేంద్ర ప్రభుత్వానికి కొందరు ఉన్నతాధికారులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని..చెప్పినా సరే అసలు సీఎం వో అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ టిడిపి నేతలు ఫైర్ అయ్యిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

అంతేకాదు ప్రభుత్వం నుంచీ జారీ అవుతున్న ఫైళ్లు ఉత్తర్వులు ఒక్క రోజులో జరిగిన పనులు అన్నీ జగన్ కి వెళ్ళిపోతున్నాయి…సచివాలయంలో ఇంత తతంగం జరుగుతున్నా…ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఏ ఒక్కరూ తీసుకెళ్లడం లేదని మంత్రి వర్గంలో తీసుకోబోయే నిర్ణయాలు సైతం కేంద్రం చెవికి వెళ్ళిపోతున్నాయి అని తెలుస్తోంది ఈ విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టక పోవడంతో ఏపీలో జరిగే అన్ని కీలక నిర్ణయాలు ముఖ్య నేతలకి తెలియక ముందే వైసీపి బిజెపి నేతలకి చేరిపోతున్నాయి అంటూ తెగ హైరానా పడిపోతున్నారు టీడీపీ నేతలు.