షాకింగ్ న్యూస్.. ఇక స్పీడ్ ని బట్టి ఫైన్స్!

స్పీడ్‌ థ్రిల్స్‌… బట్‌ కిల్స్‌’ వేగం ఆనందాన్ని ఇస్తుంది.కానీ, మనిషి ప్రాణాలనూ తీస్తుంది.

 Shocking News Fines Depending On The Speed Speed, Vehicle, Fine, Latest News, K-TeluguStop.com

అని దీనర్థం.ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.కేవలం అతివేగమే ప్రమాదాలకు కారణమని ఏటా ‘నాయ్‌ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు నిర్వహించే సర్వేలో వెల్లడవుతోంది.

దీంతో పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలకు వివిధ శ్లాబుల్లో చలానాలు విధించేందుకు ట్రాఫిక్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

పరిమితికి మించి వేగంగా వాహనం నడిపితే.

వేగాన్ని గుర్తించి జరిమానా విధిస్తారు.ఉదాహరణకు 50 కి.మీ.పరిమితి ఉన్నప్పుడు దానికి మించి ఎన్ని కి.మీ.వేగంగా వెళ్తుందో పరిశీలించి, పరిమితి 10 కి.మీ.దాటితే ఓ రకం, 20 కి.మీ.దాటితే కాస్త ఎక్కువ, అలాగే 30 కి.మీ.దాటితే మరింతగా చలానాలు విధిస్తారు.వాహనవేగాన్ని గుర్తించడానికి మరిన్ని ప్రాంతాల్లో స్పీడ్‌ లిమిట్‌ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.

Telugu Fine, Key, Latest, Speed, Vehicle-Latest News - Telugu

పార్కింగ్‌ సమస్య ఇప్పుడు అందరికి ప్రహాసనంగా మారింది.బయటకెళితే వాహనాన్ని ఎక్కడ నిలపాలో తెలియదు.వెంటనే వచ్చేద్దామని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి చేయడంతో.

దుకాణంలోకి వెళ్లి వచ్చేలోగా చలానా వచ్చేస్తోంది.అయినా.

అవేమి పట్టనట్టు మళ్ళీ మళ్ళీ అడ్డదిడ్డంగా పార్కింగ్ లు చేసి ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు కొందరు.అందుకే రద్దీ ప్రాంతాల్లో అడ్డదిడ్డమైన పార్కింగ్‌కు కూడా చెక్‌ పెట్టనున్నారు.

పార్కింగ్‌ ఏర్పాట్లు లేకుండా వ్యాపారం చేసే ప్రాంతాలను ట్రాఫిక్‌ పరంగా సమస్యాత్మకంగా గుర్తించి చర్యలు తీసుకోనున్నారు.ట్రాఫిక్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్‌లకు పాల్పడే వాహనచోదకులకు రెట్టింపు జరిమానా విధించడంతో పాటు వ్యాపార సంస్థల నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube