జక్కన్న కోసం కట్టప్పలా మారుతున్న తారక్

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఆర్ఆర్ఆర్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Shocking News About Ntr Look In Rrr-TeluguStop.com

అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్టర్‌లను ఇప్పటివరకు చిత్ర యూనిట్ రిలీజ్ చేయలేదు.కానీ ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

కొమురం భీం పాత్రలో నటిస్తోన్న తారక్ ఈ సినిమాలో చేసే యాక్షన్‌కు జనాలు ఫిదా కావడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.అయితే ఈ పాత్ర చేసే కొన్ని సీన్స్‌లో తారక్ లుక్ పరంగా గుండు కొట్టించుకోవాలని దర్శకుడు రాజమౌళి ఆదేశించాడట.

దీనికి తారక్ వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.తారక్‌ను మరి ఆ లుక్‌లో చూపించే ధైర్యం చేస్తున్న రాజమౌళిని తారక్ ఫ్యాన్స్ ఏమంటారా అనే సందేహం అందరిలో మొదలైంది.

కానీ పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పనైనా చేస్తానంటున్నాడు తారక్.గతంలో యమదొంగ సినిమాలో స్లిమ్‌గా కనిపించాలని జక్కన్న చెప్పడంతో చాలా బరువు తగ్గి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

మరి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం కట్టప్పలా గుండు చేసుకునే తారక్‌ను ఎలా చూపిస్తారో అనే ఆసక్తి సర్వత్రా మొదలైంది.ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube