సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) వయస్సు పెరుగుతున్నా ఆయన ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.తన లుక్స్ తో మహేష్ బాబు అందరినీ మాయ చేస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా సినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతుండగా మహేష్ భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు ఆ సినిమాలతో కచ్చితంగా విజయాలు దక్కే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
అమ్మాయిలో మహేష్ బాబుకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ముట్టుకుంటే కందిపోతారేమో అనేంత అందంగా మహేష్ బాబు ఉంటారు.కొంతమంది అమ్మాయిలు మహేష్ బాబుపై ఉన్న అభిమానంతో ఆయనను ఒక్కసారైనా తాకాలని కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆశ పడుతూ ఉంటారు.
కొంచెం క్రేజీగా అనిపించినా ఈ విధంగా ఆలోచించే అమ్మాయిలు చాలామంది ఉన్నారు.

అయితే ఒక సందర్భంలో ఒక అమ్మాయికి మహేష్ తో మాట్లాడే ఛాన్స్ దక్కగా ఆమె మహేష్ బాబుతో మిమ్మల్ని తాకొచ్చా అని అడగగా తాకవచ్చని మహేష్ బాబు సమాధానం ఇచ్చారు.ఆ అమ్మయి వెంటనే తన చేతితో మహేష్ వేళ్లను టచ్ చేసి తెగ సంతోషించారట.ఆ అమ్మాయి తనను ఈ స్థాయిలో అభిమానించడంతో మహేష్ బాబు సైతం ఎంతో సంతోషించారని సమాచారం.

తాను కూడా మనిషినే అయినా ఒక అమ్మాయి ఈ విధంగా తన అభిమానాన్ని చూపించడం సంతోషాన్ని కలిగించిందని మహేష్ చెప్పుకొచ్చారు.మహేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.మహేష్ బాబును అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.
తాజాగా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్న సంగతి తెలిసిందే.