అమెరికాలో షాకింగ్ ఘటన..వైద్యం చేయమంటూ ఆసుపత్రికి వెళ్ళిన...

సాటి మనిషిపై మాత్రమే కాదు మూగాజీవాలపై కూడా మనిషి ప్రేమ చూపించాలి అలా చూపించిన నాడే మనిషిగా మన జన్మ చరితార్ధం అవుతుంది.మనకు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వెంటనే హాస్పటల్ కి వెళ్ళిపోతాం.

 Shocking Incident In America..went To The Hospital For Treatment , America, De-TeluguStop.com

మనలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటె వెంటనే వారిని హాస్పటల్ కి తీసుకువెళ్తాం.అలాగే కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగితే హుటాహుటిగా వారికి అన్ని సపర్యలు చేస్తాం.

అయితే ఓ మూగ జీవికి బలమైన దెబ్బ తగిలితే దాని పరిస్థితి ఏంటి.అవి ఏ హాస్పటల్ కి వెళ్తాయి, తమకు తాముగా అవి వెళ్ళలేవు కాబట్టి మనమే బాధ్యతగా వాటిని సహృదయంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి.యజమానులు అయితే పెంచుకునే జీవులను హాస్పటల్ కు తీసుకువెళ్తారు.మరి రోడ్డుపై ఉండే వాటి పరిస్థితి ఏంటి ఎవరూ పట్టించుకోక పొతే అవి ఆ బాధతో మృతి చెందాల్సిందే.

అయితే అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది.ఓ జింకను రోడ్డు పై కారు డీ కొట్టడంతో గాయపడిన జింక హుటాహుటిన పరిగెత్తుకుంటూ మూగ జీవాలకు వైద్యం చేసే వెటర్నరీ హాస్పటల్ కు వెళ్లి వైద్యుడి ముందు నిలబడింది.

ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.లూసియానాలో జరిగిన ఈ ఘటన అక్కడి ఆస్పత్రిలో ఉన్న వారందరినీ షాక్ కి గురిచేసింది.

బాటన్ రూజ్ లో ఉన్న అవర్ లేడీ ఆఫ్ ది లేక్ రీజనల్ మెడికల్ సెంటర్ లోకి పరిగెత్తుకుంటూ ఓ జింక వచ్చింది.హుటాహుటిగా వచ్చిన జింక తనకేదో తెలుసు అన్నట్టుగా.

Telugu America, Deer, Ladylake-Telugu NRI

ఎస్కలేటర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వైద్యుడి గదిలోకి వెళ్ళింది.వైద్యుడికి చూస్తూ అక్కడే ఉండిపోయిన తరువాత ఆ జింక కాలిగి గాయం అయినట్టు గుర్తించిన అతడు వైద్యం చేశాడు.ఈ ఘటన చూసిన వారందరూ ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు.ఇలాంటి సంఘటన తాము చూడటం ఇదే మొదటి సారని, జింక నేరుగా వైద్యుడి వద్దకు వెళ్లి ఆగడం తమను ఎంతో షాక్ కి గురిచేసిందని అంటున్నారు.

ఈ పరిణామాలతో వైద్యులు కూడా షాక్ తిన్నారు.మా హాస్పటల్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ చూడలేదని ఇది అరుదైన సంఘటన అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube