షాకింగ్‌..చెత్త కాంబినేషన్‌.. ఆసక్తి పెంచుతున్న మూవీ   Shocking Hero Nani Next With Anushka Shetty     2018-07-11   03:33:59  IST  Raghu V

నాని వరుసగా చిత్రాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ‘దేవదాస్‌’ అనే మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్న నాని తాజాగా గౌతమ్‌ దర్శకత్వంలో ‘జర్సీ’ అనే చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ చిత్రం క్రికెట్‌ నేపథ్యంలో ఉండబోతుంది. ఆ చిత్రంతో పాటు మరో చిత్రానికి కూడా నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నాని ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న యేలేటి గత కొన్ని రోజులుగా మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌తో మూవీ చేసేందుకు ప్రయత్నాలు చేశాడు.

వరుసగా ఫ్లాప్‌లు వస్తున్న నేపథ్యంలో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రయోగాలకు దూరంగా ఉండాలని భావించాడు. అందుకే చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో చిత్రాన్ని చేసే ఆలోచనను ఉపసంహరించుకున్నాడు. దాంతో అదే స్క్రిప్ట్‌ను నాని వద్దకు తీసుకు రావడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నాని సినిమా మొదలు అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్కను అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఇప్పటి వరకు ఎంతో మంది సీనియర్‌, స్టార్‌ హీరోలతో నటించిన అనుష్క ఖచ్చితంగా నానికి సూట్‌ అవ్వదని, వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ అంటే ఖచ్చితంగా చెత్త కాంబినేషన్‌ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి క్రేజ్‌ పరంగా మరియు లుక్‌ పరంగా కూడా కలిసి నటిస్తే సెట్‌ అవ్వదు. అనుష్క, నానిల మద్య రొమాన్స్‌ అక్క, తమ్ముడి మద్య రొమాంటిక్‌ సీన్స్‌ అన్నట్లుగా ఉంటాయని ముందే హెచ్చరిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు అనుష్కను తీసుకుంటున్నట్లుగా ప్రకటించలేదు.

ఒక వేళ నాని మూవీలో అనుష్క ఉన్నా కూడా హీరోయిన్‌గా ఉండకపోవచ్చు అని కొందరు భావిస్తున్నారు. నానికి జోడీగా మరో హీరోయిన్‌ ఉంటుంది. ముఖ్య పాత్రలో అనుష్క కనిపించే అవకాశం ఉందేమో అని కొందరు అంటున్నారు. నాని మూవీలో అనుష్క ఉంటే ఖచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. కాని నాని, అనుష్కలు రొమాన్స్‌ చేస్తే, ఇద్దరు జంటగా నటిస్తే మాత్రం సినిమా ఏమాత్రం ఆకట్టుకోక పోవచ్చు. మరి దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి ఆలోచన ఏంటో చూడాలి.