ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. పెళ్లి అప్పుడేనట..?

స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పటికే పెళ్లి చేసుకోగా ప్రభాస్ కూడా త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Shocking Gossips Goes Viral About Prabhas Marriage-TeluguStop.com

బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని జోరుగా వార్తలు వచ్చాయి.మరోవైపు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా కథలను, పాన్ ఇండియా డైరెక్టర్లను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు.? అనే ప్రశ్నకు 2025 వరకు ప్రభాస్ పెళ్లి జరగడం కష్టమేనని ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల వల్లే పెళ్లి ఆలస్యమవుతోందని తెలుస్తోంది.కొన్నిరోజుల క్రితం ప్రభాస్ కు పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.ప్రభాస్ ఒకే సమయంలో రెండు సినిమాల్లో నటిస్తూ ఉండటంతో పాటు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

 Shocking Gossips Goes Viral About Prabhas Marriage-ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. పెళ్లి అప్పుడేనట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా మూడు సినిమాలలో నటిస్తున్నారు.

Telugu #salaar, 2025, Aadipurush, Goes Viral, Prabhas Fans, Prabhas Marriage, Prabhas Marriage Update, Prabhas Movies, Radhe Shyam, Radheshyam Promotions, Shocking Gossips, Viral News-Movie

ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కొన్ని సీన్లు పూర్తి కాగా సలార్ సినిమా షూటింగ్ కొంతమేర పూర్తైంది.ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక సినిమాలో సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో మరో సినిమాలో ప్రభాస్ నటించనున్నారని తెలుస్తోంది.

సలార్ సినిమా కాకుండా ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో కాదని వస్తున్న వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి.రాధేశ్యామ్ ప్రమోషన్స్ లోనైనా ప్రభాస్ పెళ్లి గురించి స్పష్టత ఇస్తారేమో చూడాల్సి ఉంది.

##Salaar #Radhe Shyam #Prabhas Movies #PrabhasMarriage #2025

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు