మన దగ్గర ఆ మూడే ప్రమాదమట.. యాంకర్ రవి ఏం చెప్పాడంటే ?

మనం పాములను చుస్తే చాలు హడలి పోతాము.వాటిని చూడగానే ఒక రకమైన భయం పుడుతుంది.

 Shocking Facts Explained By Friends Of Snakes Society-TeluguStop.com

ఎందుకంటే వాటికీ విషం ఉంటుందని అవి కాటు వేస్తే చనిపోతామని భయపడతాము.వాటిని చూడగానే వెంటనే కర్ర పట్టుకుని కొట్టి మరి చంపుతాము.

మళ్ళీ మనమే నాగుల చవితి వస్తే అదే పాముకు పసుపు, కుంకుమ, పండ్లు పలహారాలు పెట్టి మరి పూజిస్తాము.

 Shocking Facts Explained By Friends Of Snakes Society-మన దగ్గర ఆ మూడే ప్రమాదమట.. యాంకర్ రవి ఏం చెప్పాడంటే -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పాము కనిపిస్తే వెంటనే ఏం చేయాలో యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియో ద్వారా సమాచారాన్ని అందించాడు.

యాంకర్ రవి వాళ్ళ ఇంట్లో నాగు పాము కనిపించిందని వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి వాళ్ళను పిలిపించాడు.అందులో ఒక వ్యక్తి రవి సోదరుడు కాగా ఆయనతో విలువైన సమాచారాన్ని అందరికి తెలియ జేశాడు.

రవి సోదరుడు మాట్లాడుతూ.పాములు గురించి ఏవి ఎలా ఉంటాయో తెలియక జనాలు వాటిని చుసిన వెంటనే చంపేస్తారు.

కానీ పాములు వాటి ఆహారం కోసం మాత్రమే తిరుగుతాయట.అది మనల్ని చూసి పగ బట్టదట.

అందుకే వాటిని చూసి భయపడ కూడదట.మనం ఏ పామును చుసిన కాటు వేస్తె ప్రమాదం అని అనుకుంటాం.

కానీ మన దగ్గర ఉన్న 300 రకాల పాముల్లో కేవలం నాలుగు మాత్రమే విష సర్పాలట.

అది మన హద్రాబాద్ సమీపంలో అయితే కేవలం మూడు మాత్రమే విష సర్పాలు ఉన్నాయని అతడు తెలిపాడు.నాగు పాము, రక్త పింజర, కట్ల పాము మాత్రమే మన దగ్గర ప్రమాదమైనవి అని ఆయన తెలిపాడు.మనం పొరపాటున దానిపై తగిలితేనే పాము కారుస్తుందట.

ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఈ వీడియోలో తెలిపాడు.ఈ సందర్భంగా యాంకర్ రవి మాట్లాడుతూ పాము కనిపిస్తే చంపేయకుండా 8374233366 నెంబర్ కు ఒక్క కాల్ చేస్తే చాలు అని ఆయన తెలిపాడు.

https://youtu.be/o38e2PCR6MU
#Anchor Ravi #SnakeBite #FriendsSnakes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు