టాలీవుడ్ హీరోలలో ఒకరైన ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో అందుకున్న విజయాలను పరిశీలిస్తే అతను కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడని అందరూ భావించారు.తేజ డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం, నువ్వునేను సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోగా వీఎన్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన మనసంతా నువ్వే సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అయితే ఉదయ్ కిరణ్ మరణానికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అటు వృత్తిపరంగా ఇటు వ్యక్తిగతంగా కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని చాలామంది భావిస్తారు.
అయితే అప్పటి పేపర్ క్లిప్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అప్పట్లో ఉదయ్ కిరణ్ తో రెండు భాషల్లో ఒక సినిమాను మొదలుపెట్టారు.
80 శాతం షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.
సినిమా ఆగిపోయిన సంవత్సరం తర్వాత ఏఎం రత్నంను మీడియా మిత్రులు సినిమా గురించి ప్రశ్నించగా ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఒత్తిడి రావడంతో సినిమాను ఆపేశామని చెప్పుకొచ్చారు.ఈ పేపర్ క్లిప్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఉదయ్ సోదరి ఉదయ్ ఆత్మహత్యకు ఆ ప్రముఖ హీరోకు ఎటువంటి సంబంధం లేదని చాలాసార్లు చెప్పారు.
అయితే ఆ స్టార్ హీరో వల్లే ఉదయ్ కిరణ్ చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలామంది నమ్ముతారు.2012 సంవత్సరంలో విషిత అనే యువతిని ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకున్నారు.పెళ్లైన రెండేళ్లకే ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఉదయ్ కిరణ్ వార్తల్లో నిలవడం గమనార్హం.ఉదయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ రిలీజ్ కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.