ఎవరైనా కుల ప్రస్తావన తెస్తే ఎన్టీఆర్ అలా ప్రవర్తించేవారు.. రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే.అటు సినిమా హీరోగా, ఇటు రాజకీయ నాయకునిగా సీనియర్ ఎన్టీఆర్ సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

 Shocking Facts About Senior Ntr Details Here Goes Viral In Social Media  , Senio-TeluguStop.com

ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో తనకంటే అద్భుతంగా ఎవరూ నటించలేరు అనేలా ఎన్టీఆర్ నటించేవారు.సీనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులలో రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) కూడా ఒకరు.

ఎన్టీఆర్ శతజయంతి( NTR centenary ) సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంత వరకు సీనియర్ ఎన్టీఆర్ చెరిగిపోని జ్ఞాపకం అని తెలిపారు.

పూర్వజన్మ సుకృతం వల్ల సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన గడ్డపైనే నేను పుట్టానని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.సీనియర్ ఎన్టీఆర్ కు దగ్గరగా ఉండే గొప్ప అవకాశం నాకు దక్కిందని ఆయన వెల్లడించారు.

Telugu Ntr Centenary, Rajendra Prasad, Senior Ntr, Tollywood-Movie

నా తల్లీదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల ఈ అదృష్టం దక్కిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.తెలుగువాడిగా ఎన్టీఆర్ పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అని ఆయన తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ చేసిన కార్యక్రమాలను మనం మననం చేసుకోవాలని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ జీవించి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడినని ఆయన పేర్కొన్నారు.

Telugu Ntr Centenary, Rajendra Prasad, Senior Ntr, Tollywood-Movie

నేను కెరీర్ పరంగా సక్సెస్ కావడానికి ఎన్టీఆర్ కారణమని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.ఎంతోమందికి సినిమాలకు సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ సహాయం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.ప్రజలను ఎన్టీఆర్ దేవుళ్లుగా భావించారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.ఎవరైనా కులం గురించి మాట్లాడితే సీనియర్ ఎన్టీఆర్ కోప్పడేవారని కులాలకు, మతాల గురించి ఆయన పట్టించుకునే వారు కాదని ఆయన అందరివాడని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

భవిష్యత్తు తరాలకు సైతం సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలియాలని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube