ఇది కదా గెలుపంటే.. ఈ డైరెక్టర్ పడుకున్న ఫుట్ పాత్ పక్కనే పెద్ద ఇల్లు కొన్నాడట!

బాహుబలి, బాహుబలి2( Baahubali, Baahubali2 ) సినిమాలు ప్రభాస్ తో పాటు ఆ సినిమా కోసం పని చేసిన చిన్న నటులకు, టెక్నీషియన్లకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం పని చేసిన నటులలో తేజ కాకుమాను కూడా ఒకరు.

ఈ నటుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు నచ్చి చేసిన పాత్రలు అని ఆయన తెలిపారు.

బాహుబలి సినిమాకు సంబంధించి రాజమౌళి గారు డైలాగ్ ఇచ్చి వెంటనే చెప్పేయమన్నారని గంట సమయం ప్రాక్టీస్ చేసి ఆ డైలాగ్ చెప్పానని తేజ ( teja )కామెంట్లు చేశారు.షూటింగ్ రోజు డైలాగ్ ఎలా గుర్తు పెట్టుకున్నావని నాకు నోరే తిరగడం లేదని ప్రభాస్ అన్నారని తేజ చెప్పుకొచ్చారు.నేను డైలాగ్ చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుందని ఆయన కామెంట్లు చేశారు.

తమిళ డైలాగ్స్ కూడా అప్పుడు నేర్చుకున్నానని తేజ వెల్లడించారు.

Advertisement

ఆకాశవాణి సినిమా సమయంలో సముద్రఖనితో( samudrakhani ) పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు.నాకు కూతురు పుట్టిందని సముద్రఖనికి చెబితే ఆయన గోల్డ్ బ్రాస్లెట్ ఇచ్చారని తేజ చెప్పుకొచ్చారు.నా కూతురుకు నేను ఇచ్చుకున్నానని ఆయన అన్నారని సముద్రఖని ఈ స్థాయికి చేరుకోవడం వెనుక కష్టాలు అన్నీఇన్నీ కావని తేజ కామెంట్లు చేశారు.

సముద్రఖనికి యాక్టింగ్ అంటే ఇష్టమని ఆయన వెల్లడించారు.ఊరి నుంచి వచ్చినప్పుడు సముద్రఖని ఎక్కడైతే ఫుట్ పాత్ పై పడుకున్నాడో దాని పక్కనే ఇల్లు కొన్నాడని తేజ అన్నారు.

సముద్రఖని ఆఫీస్ అంతటా బుక్స్ ఉంటాయని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.సముద్రఖని కన్నీటి కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.తేజ సముద్రఖని గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

సముద్రఖని ప్రస్తుతం వినోదాయ సిత్తం రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.సముద్రఖని సక్సెస్ రియల్ సక్సెస్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు