స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) సినిమాలు అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి.సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు కళ్లప్పగించి చూసేలా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయంలో రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే జక్కన్న సినిమాలలో ఒకటి రెండు సినిమాలు మినహా మిగతా సినిమాలకు కథలను అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) అనే సంగతి తెలిసిందే.
అయితే ఇండస్ట్రీలో చాలామంది విజయేంద్ర ప్రసాద్ కథల వల్లే జక్కన్న సక్సెస్ అయ్యారని లేకపోతే ఆయన ఈ స్థాయిలో సక్సెస్ సాధించేవారు కాదని చాలామంది ఫీలవుతారు.
అయితే ఈ మాటల్లో లాజిక్ లేదని రాజమౌళి సన్నిహితులు భావిస్తారు.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్1 సినిమాకు పృథ్వీ అనే వ్యక్తి కథ అందించారు.
మర్యాదరామన్న సినిమాకు ఎస్.ఎస్.కాంచి కథ అందించారు.

విజయేంద్ర ప్రసాద్ కథలైనా, ఎవరి కథలైనా జక్కన్న స్క్రీన్ ప్లే సొంతంగా రాసుకుంటారు.తన స్క్రీన్ ప్లేతో సాధారణ కథను అద్భుతమైన కథగా తీర్చిదిద్దడంలో జక్కన్న ప్రతిభ ఉంది.అవసరం అయితే సొంతంగా కథలు రాసుకునే ప్రతిభ కూడా జక్కన్నకు ఉంది.
రాజమౌళి పలు సందర్భాల్లో బాల్యంలో నేను సొంతంగా కథలు రాసి చెప్పేవాడినని చెప్పుకొచ్చారు.అయితే రాజమౌళి సక్సెస్ లో విజయేంద్ర ప్రసాద్ కు కొంత వాటా ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా పనులతో బిజీగా ఉండగా ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.రాజమౌళి ఈ సినిమా విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ త్వరలో వస్తాయో చూడాలి.మహేష్ మాత్రం ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.స్టార్ హీరో మహేష్ బాబు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు ఓటు వేస్తున్నారు.