మళ్లీ పెళ్లి సినిమా( Malli Pelli ) ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా పవిత్ర లోకేశ్ నటనకు మంచి పేరు వచ్చింది.పవిత్ర లోకేశ్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని కామెంట్లు వినిపించాయి.
అయితే ఇంత టాలెంట్ ఉన్న పవిత్ర లోకేశ్ స్టార్ హీరోయిన్ ఎందుకు కాలేకపోయారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.పలు సినిమాలలో పవిత్ర లోకేశ్ హీరోయిన్ గా కూడా నటించారు.

గ్లామర్ రోల్స్ లో సైతం పవిత్ర లోకేశ్( Pavitra Lokesh ) అద్భుతంగా నటించగలరనే సంగతి తెలిసిందే.అయితే పవిత్ర లోకేశ్ స్టార్ హీరోయిన్ కావాలని ఆశ పడ్డారు.ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు.పవిత్ర లోకేశ్ తండ్రి కూడా ఫిల్మ్ యాక్టర్ కావడం గమనార్హం.కన్నడ సినిమాలతో హీరోయిన్ గా పవిత్ర కెరీర్ మొదలైంది.అయితే పవిత్ర లోకేశ్ హైట్ దాదాపుగా 5 అడుగుల 10 అంగుళాలు అని ఈ హైట్ ఆమెకు మైనస్ అయిందని సమాచారం.
కొంతమంది స్టార్ హీరోయిన్లు( Star Heroines ) సైతం ఆమెకు అవకాశాలు రాకుండా చేశారని సమాచారం.
ఎత్తు తక్కువగా ఉన్న హీరోలు ఆమెకు ఛాన్స్ ఇవ్వకపోవడం ఆమెకు మైనస్ అయిందని తెలుస్తోంది.
పవిత్ర లోకేశ్ ప్రస్తుతం రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా సినిమా సినిమాకు ఆమె పారితోషికం అంతకంతకూ పెరుగుతోంది.నరేష్, పవిత్ర కాంబినేషన్ కు మంచి గుర్తింపు ఉండటంతో ఈ కాంబోలో సినిమాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.

నరేష్ పవిత్ర తమ వ్యక్తిగత జీవితంపై వచ్చిన అన్ని విమర్శలకు మళ్లీ పెళ్లి సినిమా ద్వారా చెక్ పెట్టారు.తమ బయోపిక్ లో తామే నటించడం నరేష్, పవిత్రల విషయంలో జరిగిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.నరేష్ పవిత్ర ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు.అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.
