Megastar Chiranjeevi : చిరంజీవి స్టార్ హీరో కావడానికి కారణమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే!

చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నా కొన్ని సినిమాలు ఆయన కెరీర్ పరంగా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి.చిరంజీవి స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదగగా ఖైదీ సినిమా చిరంజీవి ఇమేజ్ ను మార్చిన సినిమాలలో ఒకటి.

 Shocking Facts About Megastar Chiranjeevi Cine Career Details Here Goes Viral ,-TeluguStop.com

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ఎక్కువ సంఖ్యలో అభిమానులకు చిరంజీవిని దగ్గర చేసింది.ఈ సినిమాకు ఈ జనరేషన్ లో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

కోదండ రామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఈ కాంబినేషన్ లో వచ్చిన పసివాడి ప్రాణం కమర్షియల్ గా సక్సెస్ ను సాధించడంతో పాటు చిరంజీవిని అభిమానించే అభిమానులకు ఎంతగానో నచ్చింది.రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన యముడికి మొగుడు సినిమా కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.

చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా కూడా ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది.గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి.

బి.గోపాల్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంద్ర సినిమా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.

Telugu Chiranjeevi, Cine Career, Kodanda Rami, Mogudu-Movie

ఠాగూర్ సినిమా విజయంతో చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఏర్పడింది.ఈ సినిమా మెగా అభిమానులతో పాటు సాధారణ అభిమానులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది.చిరంజీవి రీఎంట్రీలో ఖైదీ నంబర్ 150 సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.మెగా అభిమానులతో పాటు సాధారణ అభిమానులకు సైతం ఈ సినిమా ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube