Kantara Movie : కాంతార మూవీలో ఏముందనే వాళ్లకు జవాబిదే.. అందుకే బ్లాక్ బస్టర్ అంటూ?

కాంతర మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటనే సంగతి తెలిసిందే.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార భారీ బడ్జెట్ సినిమాలు సైతం సాధించలేని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Shocking Facts About Kantara Movie Details Here Goes Viral , Kantara ,  Kantara-TeluguStop.com

అయితే ఓటీటీలో కాంతార సినిమాను చూసిన ప్రేక్షకులలో చాలామంది ఈ సినిమాలో ఏముందని కామెంట్లు చేస్తున్నారు.వరాహరూపం పాట లేకుండా కాంతార మూవీని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

మరీ అద్భుతం అని ఈ సినిమా అనిపించలేదని చెబుతున్నారు.వరాహ రూపం పాట లేకపోవడం వల్ల అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు చెప్పిన అమౌంట్ తో పోల్చి చూస్తే 25 శాతం తక్కువ ఇచ్చారని తెలుస్తోంది.

కోర్టు సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులకు సూచనలు చేసినట్టు సమాచారం అందుతోంది.అయితే కాంతార మూవీ సాధారణ కథతోనే తెరకెక్కినా భూతకోల అనే అద్భుతమైన కళ గురించి ఈ సినిమాలో ప్రస్తావించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు, ఇతర భాషల ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ఈ కళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.భవిష్యత్తు తరాలకు సైతం కళను పరిచయం చేసేలా ఉన్న కాంతార మూవీలో భిన్నమైన కథ, కథనాలు, పల్లె ప్రజల అమాయకత్వం, నెగిటివ్ షేడ్స్ లో చూపించిన పోలీస్ ప్రజల మేలు కోసం పరితపించడం, విలన్ కు సంబంధించిన ట్విస్ట్, చివరి 15 నిమిషాల్లో న భూతో న భవిష్యత్ అనే రేంజ్ లో రిషబ్ శెట్టి నటన కాంతార సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.

Telugu Amazon Prime, Kantara, Varaharupam-Movie

కళాత్మక విలువలతో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.స్టార్ హీరో ఎవరైనా నటించి ఉంటే ఈ సినిమా రీచ్ పెరిగి ఉండేది.కాంతార సినిమా ఒక విధంగా అద్భుతమే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube