Horror concept movies : హర్రర్ కాన్సెప్ట్ తో తీస్తే సినిమా బ్లాక్ బస్టరా.. ఈ సినిమాలను గమనించారా?

టాలీవుడ్ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో కొత్తదనానికి పెద్దపీట వేస్తున్నారు.మూవీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటే ఆ సినిమాలను హిట్ చేస్తున్నారు.

 Shocking Facts About Horror Concept Movies Details Here Goes Viral , Horror Conc-TeluguStop.com

గత కొన్నేళ్ల నుంచి హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.శుక్రవారం రోజున థియేటర్లలో విడుదలైన మసూద సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం.

తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అదే సమయంలో దెయ్యం కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తుండటంతో ఈ సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.

దెయ్యం కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త కాకపోయినా కథ, కథనం కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఈ సినిమాలను సక్సెస్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఒకటైన విక్రాంత్ రోణా సినిమా కూడా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

షాకింగ్ ట్విస్టులు ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్రలు పోషించాయనే విషయం తెలిసిందే.ధనుష్ నటించిన నేనే వస్తున్నా సినిమా కూడా ఆత్మల కాన్సెప్ట్ తో తెరకెక్కి తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.

Telugu Masooda, Dhanush, Horror Concept, Nane Vasthunna, Tollywood, Vikranth Ron

తెలుగులో ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.యూటర్న్, రాక్షసుడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.హర్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube