Chandramohan Properties : వంద కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్న చంద్రమోహన్.. అలా చేయడంతో?

ప్రముఖ టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ సినిమాల్లో అన్ని రకాల పాత్రల్లో నటించారు.తండ్రి పాత్రల్లో, తాత పాత్రల్లో అద్భుతంగా నటించి చంద్రమోహన్ మెప్పించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ తాను చేసిన తప్పుల వల్ల ఏకంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్నానని ఆన్నారు.చంద్రమోహన్ మాట్లాడుతూ కోంపల్లి దగ్గర 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నానని మేనేజ్ చేయడం సాధ్యం కాక ద్రాక్ష తోటను అమ్మేశానని తెలిపారు.

మద్రాస్ లో నాకు 15 ఎకరాల పొలం ఉండేదని శోభన్ బాబు ఆ ప్రాపర్టీని అమ్మవద్దని నాకు సూచనలు చేశారని అయితే తాను మాత్రం ఆయన మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ స్థలాన్ని అమ్మేశానని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.శంషాబాద్ మెయిన్ రోడ్ లో నాకు ఆరు ఎకరాలు ఉండేదని ఆ ఆరు ఎకరాలను కూడా అమ్మేశానని చంద్రమోహన్ కామెంట్లు చేశారు.

తాను మద్రాస్ లో అమ్మేసిన స్థలం విలువ ప్రస్తుతం 30 కోట్ల రూపాయలు అని ఆయన అన్నారు.శంషాబాద్ లో నేను అమ్మేసిన స్థలంలో ప్రస్తుతం రిసార్టులు కట్టారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

స్థలాలను తాను తక్కువ రేటుకు అమ్మడం వల్ల ఏకంగా 100 కోట్ల రూపాయలు నష్టపోయానని ఆయన పేర్కొన్నారు.తాను కష్టపడి పని చేసినా సంపాదించిన మొత్తం కంటే పోగొట్టుకున్న మొత్తం ఎక్కువని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.

చంద్రమోహన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీనియర్ హీరోయిన్లలో ఒకరైన జయసుధ పరిస్థితి కూడా ఇంతేనని చంద్రమోహన్ కామెంట్లు చేశారు.చంద్రమోహన్ భార్య జలంధర మాట్లాడుతూ ఆయన చేతి నుంచి రూపాయి తీసుకున్నా కలిసొస్తుందని చాలామంది నమ్ముతారని తెలిపారు.జనవరి ఒకటో తారీఖున ఆయన చేతి నుంచి డబ్బులు తీసుకోవడానికి చాలామంది వస్తుంటారని చంద్రమోహన్ భార్య వెల్లడించారు.

చంద్రమోహన్, ఆయన భార్య చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు