షాకింగ్ – “టీడీపీ ” లోకి “క్యూ” కట్టనున్న “బీజేపీ కీలక నేతలు”   Shocking AP Bjp Key Leaders Jump Into TDP     2018-02-24   01:35:12  IST  Bhanu C

రాజకీయాల్లో నమ్మిన పార్టీ ని కాదని వేరొక పార్టీలోకి వెళ్ళడం ఏమంత పెద్ద విషయం కాదు షర్టు మార్చినంత ఈజీగా వేరొక పార్టీలోకి వెళ్ళిపోతారు..అయితే మరి కొంతమంది మాత్రం పార్టీ విధి విధానాలు మార్పులు రావడం వలనో అవమానాలు ఎదుర్కోవడం వలనో లీడర్స్ పట్టించుకోక పోవడం వలనో వెళ్ళిపోతారు..అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపి ఉండగా బీజేపి విడిచి సామాన్యంగా ఎవరు వేరే పార్టీ వైపు చూసే అవకాశం ఉందు అయితే ఏపీ లో ఎంతో కీలకంగా ఉన్న హరిబాబు విశాఖ ఎంపీ మాత్రం పార్టీని వీడి టిడిపిలోకి వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి..వివరాలలోకి వెళ్తే..

హరి బాబు లాంటి వ్యక్తులు ఎందుకు బీజేపిని విడిచి పెట్టాలి..? అనే విషయం ఆలోచిస్తే ఇప్పుడు హరి బాబు కంటే కూడా బీజేపి పైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..ఎందుకంటే ఎంతో నిబద్దత కలిగిన వ్యక్తి..నిజాయితీ పరుడుగా ఉన్న ఆయన ఎందుకు వెళ్తారు అంటే ఒక్కటే కారణం ఏపీ బిజెపిలో ఉంటున్న కొంతమంది వాగుడు కాయలు ద్వారా బీజేపీ కి నష్టం కలిగించడం ఒకటైతే మరొకటి..ఎంతో కీలకంగా మారిన విశాఖ రైల్వే జోన్, మరియు విభజన హామీలు అమలుకి నోచుకోకపోవడం..ఇవే ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి..

ఇప్పటికే ఏపీలో బీజేపిని ప్రజలు ఎంతో తీవ్రంగా వ్యతిరేకిస్తుఉంటే..మరొక వైపు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు మాత్రం చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్న మాటలు తెలుగుదేశం అభిమానులకి మాత్రమే కాకుండా ఏపీ ప్రజలలో కూడా బీజేపీ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది..ఒక వైపు హరిబాబు సమస్యని ఎంతో పొందిగ్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే సోము ఆ సమస్యని మరింత జటిలం చేస్తున్నారు..ఇదిలాఉంటే..ఏపీ లో విభజన హామీలు నెరవేర్చలేదని ప్రజలు నిలదీస్తుంటే కేంద్రం మాత్రం సైలెంట్ గా ఉండటం తో ఏపీ బీజేపీ ఎమ్మెల్యే లు , ఎంపీలు భవిష్యత్తు పై బెంగ పెట్టుకున్నారు..ఈ దిశలో కేంద్రం తమ గోడుని సైతం పట్టించుకోక పోవడంతో హరిబాబు పార్టీని వీడి ప్రజలకి తమపై ఉన్న దురాభిప్రాయాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారు.

అయితే హరిబాబు తమ అధిష్టానానికి మార్చి 10 డెడ్లైన్ విధించారు ఈలోగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా ప్రకటన ఇస్తే సరి లేకపోతె పార్టీ మారి పోతామనే హెచ్చరికలు కూడా చేశారట..అయితే హరి బాబుతో పాటుగా మంత్రి కామినేని శ్రీనివాస్, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టి మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. .ఇప్పటికే కామినేని చంద్రబాబు తో ఎంతో సన్నిహితంగా మొదటి నుంచీ ఉన్నారు…కామినేని గతంలో టీడీపీ నుంచీ బీజేపీ లోకి వచ్చిన వారే..ఇప్పుడు టీడీపీకి వెళ్ళిపోయినా టిక్కెట్ విషయంలో మాత్రం మార్పు ఉండదని ధీమాగా ఉన్నారు..ఈ వార్తల్లో ఎంత మేర నిజం ఉందొ కానీ మొత్తానికి మార్చి 10 డెడ్లైన్ ఏపీలో కాకని రేపనుంది అంటున్నారు..మరి అప్పటి వరకూ వేచి చూస్తేనే కాని ఏది నిజమో అబద్దమో తెలుస్తుంది..