మీసం తిప్పిన సీఐ ఎంపీగా పోటీ చేయడంలేదా ? కారణం ఇదేనా ?

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరి మీసం తిప్పిన సీఐ గోరంట్ల మాధవ్ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చింది.ఆయనకు టికెట్ దక్కడం అందరికి పెద్ద షాక్ ఇచ్చింది.

 Shock To Ysrcp Hindupur Mp Candidate Gorantla Madhav-TeluguStop.com

ఎంపీ సీటు దక్కడంతో ఆయన తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.ఆయనకు పార్టీ హిందూపురం ఎంపీ సీటు కూడా కేటాయించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఇపుడు ఆ స్థానంలో వైసీపీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది.అయితే నామినేషన్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నా ఆయన చేసిన రాజీనామా ఆమోదం పొందకపోవడంతో ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది.

మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినా అది ఆమోదం పొందకపోతే ఆయన వేసిన నామినేషన్ చెల్లకుండా పోతుంది.ఇది పార్టీకి కూడా పెద్ద చిక్కు తీసుకొస్తుంది.

అందుకే ఎందుకు ఈ తలనొప్పులు అనే ఆలోచనతో గోరంట్ల మాధవ్‌ అభ్యర్థిత్వాన్ని మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నటు తెలుస్తోంది.ఆయన స్థానంలో మాజీ జడ్జి కురుబ కిష్టప్ప పేరును ఫైనల్ చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్టు జరిగితే రెండు మూడు రోజుల్లో ఆయన హిందూపురం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీలో టాక్ నడుస్తోంది.

ఈ విషయంలో ప్రభుత్వం పై మాధవ్ గుర్రుగా ఉన్నారు.తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు.తాను వీఆర్ఎస్ ఇచ్చినప్పటికీ తనను విధుల నుంచి నన్ను ఎందుకు రిలీవ్ చేయడంలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయంపై కోర్టుకు వెళ్లారు.దీనిపై ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి వుంది.

కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన మాధవ్‌కు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందనేది వైసీపీ లెక్క.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube