సుప్రీంకోర్టులో వైసీపీ మంత్రికి ఎదురుదెబ్బ సీబీఐకి గ్రీన్ సిగ్నల్..!!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి సుప్రీం కోర్టులో చుక్కెదురయింది.విషయంలోకి వెళితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తు కి అనుమతి ఇవ్వటం జరిగింది.ఆదిమూలపు సురేష్ అదే రీతిలో ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరు ఐఏఎస్ అధికారులు.2009 నుండి రాజకీయాల్లో రాణిస్తున్నారు.2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఇళ్ల పై సిబిఐ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో దాడులు నిర్వహించారు.ఆ సమయంలో సురేష్ సతీమణి విజయలక్ష్మి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.

 Shock To Ycp Minister Suresh Supreme Green Signal To Cbi Suprem Court,  Cbi, Adh-TeluguStop.com

ఈ క్రమంలో విజయ లక్ష్మినీ ప్రధాన నిందితుడిగా ఆదిమూలపు సురేష్ నీ రెండవ నిందితుడిగా సీబీఐ పేర్కొంది.

కాగా తమ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎటువంటి ప్రాథమిక విచారణ జరగలేదని సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నీ కొట్టివేయాలని.

కోరారు.ఈ క్రమంలో హైకోర్టు సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నీ.కోటివేయడంతో సీబీఐ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయడం జరిగింది.అన్ని ఆధారాలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు.

సీబీఐ సుప్రీం కోర్టుకి తెలియజేయడం జరిగింది.ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సుప్రీం కోర్టుకు సిబిఐ తెలపడంతో తాజాగా జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం సీబీఐ విచారణ కొనసాగించాలని.

తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని.

ప్రాథమిక విచారణ చేపట్టవలసిన అవసరం లేదని విచారణ కొనసాగించాలని సీబీఐకి తాజాగా సుప్రీం కోర్టు అనుమతులు ఇవ్వడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube