సామాన్యులకు షాక్.. సబ్బులు, సర్ఫ్‎ల ధరలు భారీగా పెంపు!

సామాన్యుడిపై పెరుగుతున్న ధరలు మరింత భారం అవుతున్నాయి.ఇన్‌పుట్ ఛార్జ్ పెరుగుతున్న క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ భగ్గుమంటున్నాయి.

 Shock To The Common People .. Soaps, Surf Prices Increase Sharply, Common People-TeluguStop.com

నానాటికి అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోతున్న నేపథ్యంలో బతుకు జీవుడా అని పేద, మధ్య తరగతి ప్రజలు జీవనం సాగిస్తున్నారు.నిన్నమొన్నటిదాకా ఆహార పదార్థాల ధరలు పెరగగా.

ఇప్పుడు సబ్బులు, సర్ఫ్‎ల ధరలు కూడా పెరిగాయి.హెచ్యూఎల్, ఐటీసీ సంస్థలు సబ్బులు, డిటర్జెంట్లు ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించాయి.ప్రముఖ వీల్ డిటర్జెంట్ పౌడర్ 1 కేజీ ప్యాకెట్ ధరను 3.4 శాతం పెంచుతున్నట్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వెల్లడించింది.దాంతో అరకేజీ వీల్ డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్ ధర రెండు రూపాయలు పెరిగి రూ.30కి చేరుకుంది.

అయితే 250 గ్రాముల రిన్ బార్ ధర ఏకంగా 5.8 శాతం పెరిగింది.ఇప్పుడు లక్స్ సోప్ కూడా మరింత ప్రియం గా మారింది.దీని ధర ఒక్కసారిగా 21.7 శాతం పెంచుతున్నట్లు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్ తెలిపింది.దాంతో ఇప్పుడు 100 గ్రాముల 5-ఇన్-1 మల్టీ ప్యాక్ లక్స్ సోప్స్ కొనాలంటే రూ.25 ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది.ఫియామా సోప్ ధర 10 శాతం పెరిగింది.100 గ్రాముల వివేల్ సబ్బు ధర 9 శాతం పెరిగింది.150 మి.లీ ఎంగేజ్ డియోడరెంట్ బాటిల్ ధర 7.6 శాతం పెరిగింది.120 మి.లీ లీటర్ల ఎంగేజ్ పర్ఫ్యూమ్ ధర 7.1 శాతం పెరిగింది.మొన్నీమధ్య బిస్కెట్ల ధర కూడా భారీగా పెరిగింది.

Telugu Common, Lux Soap, Rin Bar, Soaps, Surf-Latest News - Telugu

ధరల పెంపు విషయంపై ఐటీసీ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.ఇన్ పుట్ ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో పరిశ్రమలు ఉత్పత్తుల ధరలను కూడా పెంచాయని తెలిపారు.అయితే కేవలం కొన్ని వస్తువుల ధరలను మాత్రమే పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.మొత్తం ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా కొంతమేర మాత్రమే పెంచాలని నిర్ణయించినట్లు వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube