శ‌శిక‌ళ‌-సెల్వంకు షాక్‌..సీఎం రేసులో కొత్త పేరు     2016-12-27   23:34:05  IST  Bhanu C

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన అనంతరం ఆ పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారన్న విషయంపై రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. జయ మ‌ర‌ణాంత‌రం ఆర్థిక‌మంత్రి ప‌న్నీర్ సెల్వంను కేంద్ర ప్ర‌భుత్వం ఆఘ‌మేఘాల మీద సీఎం చేసేసింది. ప‌న్నీర్ కుద‌రుకుంటున్న టైంలో ఇప్ప‌డిప్పుడే అన్నాడీఎంకేలో లుక‌లుక‌లు ఒక్క‌సారిగా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ సీఎం అయ్యేందుకు తెర‌వెన‌క త‌న వంతుగా పావులు క‌దుపుతోంది. ఆమె వ్య‌తిరేక వ‌ర్గం మాత్రం ఆమెకు యాంటీగా పావులు క‌దుపుతోంది. ఈ నెల 29న జ‌రిగే పార్టీ స‌ర్వ‌స‌భ్య‌స‌మావేశానికి కేవ‌లం శ‌శిక‌ళ మ‌ద్ద‌తుదారుల‌కు మాత్ర‌మే ఆహ్వానాలు పంపుతున్నారు. దీనిపై ఆమె వ్య‌తిరేక వ‌ర్గం మండిప‌డుతోంది. ఆమెకు చ‌ట్ట‌ప‌రంగా చెక్ చెప్పేందుకు రెడీ అవుతోంది.

పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నుకుంటారని శ‌శిక‌ళ వ్య‌తిరేక‌వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది. అన్నాడీఎంకే నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక స‌భ్యుడిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటే అత‌డు ఐదేళ్ల పాటు ఏ ఎన్నిక‌ల్లోను పోటీ చేసేందుకు వీలులేదు. 2011లో శ‌శిక‌ళ‌ను పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం నుంచి తొల‌గించారు. ఇప్ప‌ట‌కీ ఆమెకు ప్రాథమిక సభ్యత్వ కార్డును జారీ చేయలేదు. ఇప్పుడు ఆమెను అన్నాడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నుకుంటే అది చ‌ట్ట వ్య‌తిరేకం అవుతుంద‌ని శ‌శిక‌ళ వ్య‌తిరేక వ‌ర్గం ఆరోపిస్తోంది.

శ‌శిక‌ళ యాంటీ వ‌ర్గం ఆమెకు యాంటీగా పావులు క‌దుపుతుంటే ఆమె కోలీవుడ్ స్టార్ హీరో త‌ల అజిత్‌ను క‌లవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే విషయంలో అజిత్ మద్దతు కూడగట్టేందుకే ఈ భేటీ జరిగి ఉండవచ్చని స‌మాచారం. ఇక ఓ వైపు పార్టీలో కొంద‌రితో పాటు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అండ‌తో సీఎంగా కుదురుకునేందుకు ప‌న్నీర్ సెల్వం ట్రై చేస్తుండ‌డం, మ‌రో వైపు శ‌శిక‌ళ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా ఇప్పుడు త‌మిళ‌నాడు సీఎంగా ముచ్చ‌ట‌గా మూడోపేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.

ప‌న్నీర్ సెల్వం వ‌ర్సెస్ శ‌శిక‌ళ ఫైటింగ్ ఇలా ఉండ‌గానే త‌మిళ‌నాడు కొత్త సీఎం రేసులో మరో పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. జ‌య అన్న కుమార్తె దీప కుటుంబ వార‌స‌త్వంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాలు తాను చేస్తోన్న‌ట్టు లేటెస్ట్ అప్‌డేట్‌. దీప త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది.

శశికళ వ్యతిరేకవర్గం పన్నీర్‌సెల్వం లేదా దీపను ప్రధాన కార్యదర్శి చేయాలని పట్టుపడుతున్నారు. దీప పేరవై అనే సంస్థను స్థాపించి జోరుగా సభ్యత్వాన్ని చేరుస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని దీపపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె వీలుంటే తొంద‌ర‌లోనే లేదా ఫ్యూచ‌ర్‌లో అన్నాడీఎంకే ప‌గ్గాలు చేప‌ట్టేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. భ‌విష్య‌త్ సీఎంగా కూడా తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆమె మోడీ మ‌ద్ద‌తు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.