ఆన్‌లైన్‌ గేమింగ్ ఆడేవారికి షాక్.. GSTI కౌన్సిల్ అలా డిసైడ్ చేయబోతోంది మరి!

నేటి యువత ఆన్‌లైన్‌ గేమ్స్ కి ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో వేరే చెప్పనవసరం లేదు. ఆన్‌లైన్‌ గేమింగ్ వలన ఏటా కొన్ని వందల కుటుంబాలలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

 Shock To Online Gaming Players-TeluguStop.com

ఆడేవారు అదేదో టైంపాస్ లాగ తీసుకోకుండా చాలా సీరియస్ గా తీసుకొని నిండు జీవితాన్ని బలితీసుకుంటున్నారు.అభం శుభం తెలియని కొందరు పిల్లలు వీటివలన బలి అవుతున్నారు.

ఇటీవల ‘పబ్ జీ‘ అనే ఆటవలన ఎంతమంది అభాగ్యులు బలయ్యారో తెలియంది కాదు.తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ యెంత దూరం పెడదామన్నా, ఈ ఆధునిక యుగంలో సాధ్యపడటం లేదు.

నేటి చదువులు కూడా ఆన్లైన్ మయం అవ్వడం ఒకింత దురదృష్టంగా మారింది.

అయితే కొన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని, GST కౌన్సిల్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది.

IAMAI (ది ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 18% GSTని కొనసాగించాలని GST కౌన్సిల్‌ను కోరనున్న తరుణంలో కేంద్రం పెంచనున్న GST ఏ గేమ్స్‌కు వర్తిస్తుందనే అంశంపై ఇంకా క్లారిటీ రావలసి ఉందని IAMAI తాజాగా తెలిపింది.ఫ్రీగా ఆడే గేమ్స్‌తో పాటు, డబ్బులు చెల్లించే ఆన్‌లైన్‌ గేమ్స్‌పై GST విధిస్తారా అనే విషయంపైన స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం వుంది.

అయితే ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇండస్ట్రీపై GST పెంపు అంశం అనేది ఇప్పుడు గేమింగ్‌ ఇండస్ట్రీలో కుదుపు తీసుకురాబోతుంది.

Telugu Gst Council, Iamai, Games, Bad, Pub, Shock, Smart-Latest News - Telugu

ఈ విషయమై, పలువురు గేమింగ్ నిపుణులు ఏమి చెబుతున్నారంటే, GSTని పెంచడంవలన గేమింగ్‌ ఇండస్ట్రీ నష్టపోయే ప్రమాదం లేకపోలేదని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో ఒకవేళ పలు ఇండస్ట్రీలు షట్‌ డౌన్‌ అయినట్లయితే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.ఒకవేళ GST రేట్లను ఇంకా పెంచితే ఆ ప్రభావం గేమింగ్‌ ఇండస్ట్రీతో పాటు దేశ ఎకానమీపైకూడా పడుతుందనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేయడం కొసమెరుపు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube