మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడుతున్నారో తెలిస్తే షాకే!

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి.

 Shock To Know Which Mobile Microsoft Founder Bill Gates Is Using, Microsoft, Update , Founder, Mobil, Technology Updates , Bill Gates, Samsung Galaxy Z Fold 3 Smartphone-TeluguStop.com

మధ్యలోనే కాలేజీ చదువు మానేసి ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో గొప్ప వ్యక్తిగా ఎదిగారు.అయితే బిల్ గేట్స్ ఏ ఫోన్ వాడుతున్నారనే సందేహం చాలామందిలో ఉంటుంది.

చాలామంది బిల్ గేట్స్ తన కంపెనీకి చెందిన మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ఫోన్‌నే వాడతారని అనుకుంటారు.కానీ అది నిజం కాదు.

 Shock To Know Which Mobile Microsoft Founder Bill Gates Is Using, Microsoft, Update , Founder, Mobil, Technology Updates , Bill Gates, Samsung Galaxy Z Fold 3 Smartphone-మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడుతున్నారో తెలిస్తే షాకే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా బిల్ గేట్స్ తాను వాడుతున్న ఫోన్ ఏంటో తెలిపారు.దీంతో అందరూ అవాక్కవుతున్నారు.రెడిట్ ఆస్క్ మీ ఎనీథింగ్ వీక్లీ సెషల్‌లో ఒక యూజర్ బిల్ గేట్స్‌ ఫోన్ గురించి అడిగారు.

“సార్, మీరు ఏ ఫోన్ ఉపయోగిస్తున్నారో చెప్తారా” అని బిల్ గేట్స్ ని రెడిట్ యూజర్ ప్రశ్నించారు.అందుకు సమాధానంగా తాను మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యుయో లేదా ఏదో మైక్రోసాఫ్ట్ ఫోన్ అని చెప్తారేమో అని అందరూ ఊహించారు.లేదా యాపిల్ ఐఫోన్ అని సమాధానం వినిపిస్తుందని అనుకున్నారు.

కానీ ఆయన సామ్‌సంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

తన వద్ద ఉన్న ఆండ్రాయిడ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్క్రీన్ పెద్దగా ఉండటంతో ఇది పోర్టబుల్ పీసీలా, ఫోన్‌లా యూజ్ అవుతుందని పేర్కొన్నారు.బిల్ గేట్స్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 వాడటానికి ఒక కారణం ఉంది.అదేంటంటే గెలాక్సీ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలో MS వర్డ్, MS ఎక్సెల్ లాంటి మైక్రోసాఫ్ట్ సూట్ యాప్స్, సర్వీస్‌లు ఉంటాయి.

ఇలా సామ్‌సంగ్‌ ఫోన్స్‌ అన్ని రకాల మైక్రోసాఫ్ట్ సేవలు అందిస్తాయి కాబట్టే ఆయన ఈ ఫోన్‌ను వాడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube