పెద్దిరెడ్డి విష‌యంలో కేసీఆర్‌కు షాక్‌.. బీజేపీని వీడనివ్వ‌లేదుగా..!

ఇప్పుడు అంద‌రి చూపు హుజూరాబాద్ పైనే ఉంది.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఇప్ప‌టికే అనేక వ్యూహాలు ర‌చించాయి.

 Shock To Kcr In The Case Of Peddireddy Bjp Should Not Be Let Go, Kcr, Peddireddy-TeluguStop.com

ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలను టీఆర్ఎస్‌లోకి చేర్చుకోడానికి అనేక ప్ర‌ణాళిక‌లు వేస్తోంది.కొంత‌వ‌ర‌కు అయితే టీఆర్ఎస్ విజ‌య‌వంత‌మైంది.

టీఆర్ఎస్ ప్ర‌ణాళిక‌లో భాగంగా ఎల్‌.రమణ, పాడి కౌశిక్ రెడ్డి వంటి నేతలు కారెక్కారు.

ఇంకోవైపు బీజేపీలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కూడా టీఆర్ఎస్‌లోకి విశ్వ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే హుజూరాబాద్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న పెద్దిరెడ్డికి షాక్ త‌గిలింది.

తనను సంప్రదించకుండానే ఈటలను పార్టీలోకి తీసుకోవడంపై ఆయ‌న అసంతృప్తితో ఉన్నారు.దాంతో ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపించాయి.

దాంతో బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన విద్యాసాగర్ రావు రంగంలోకి దిగారు.పెద్దిరెడ్డిని శాంతించేలా చేశారని తెలుస్తోంది.

పెద్దిరెడ్డితో మాట్లాడిన విద్యాసాగర్‌రావు.హుజూరాబాద్‌కు బదులుగా ఆయనకు మరో నియోజకవర్గాన్ని ఇస్తాన‌ని మాటిచ్చాడ‌ని తెలుస్తోంది.

హుజూరాబాద్‌కు బదులుగా హుస్నాబాద్‌ను పెద్దిరెడ్డికి ఇస్తాన‌ని చెప్పినట్టు సమాచారం.దీనికి సంబంధించి పార్టీ నుంచి హామీ ఇప్పించేందుకు కూడా తాను సిద్ధమ‌ని బ‌య‌ట టాక్.

విద్యాసాగర్‌రావు రంగంలోకి దిగ‌డం వ‌ల్లే ఆయ‌న బీజేపీలో కొన‌సాగుతున్నార‌ని తెలుస్తోంది.మరో నియోజకవర్గం కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన వెన‌క్కి త‌గ్గార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

Telugu Ramana, Peddi, Peddi Trs, Telangana, Trs, Vidya Sagar Rao-Telugu Politica

దాని మూలంగానే టీఆర్ఎస్‌లోకి వెళ్లాలనే నిర్ణయాన్ని విర‌మించుకున్నాడ‌ని చ‌ర్చ న‌డుస్తోంది.అయితే పెద్దిరెడ్డి నిర్ణయం మార్చుకున్నాడా లేద‌నేది ఇంకా స‌స్పెన్స్‌గానే ఉంది.టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో ఎన్ని ప్ర‌యోగాలు చేయాలో అన్ని ప్ర‌యోగాలు చేస్తోంది.హుజూరాబాద్‌లో ఎలాగైనా గెల‌వ‌డానికి హుజూరాబాద్‌లో ఉన్న వివిధ పార్టీలలో ఉన్న ముఖ్య నేత‌ల‌ను టీఆర్ఎస్‌లోకి చేర్చుకోవ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

హుజూరాబాద్ ఎన్నికలు ఎలాగున్నాయంటే 2023లో వ‌చ్చే ఎన్నిక‌లు ముందుగానే వ‌చ్చిన‌ట్టు అనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube