ఫ్యాన్స్ కు షాక్.. తల్లైన హీరోయిన్ శ్రీయా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి శ్రీయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈమె ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Shock To Fans Heroine Shriya Is A Mother Shriya, Heroine, Tollywood, Fans Shock,-TeluguStop.com

ఇలా వృత్తిపరంగా వ్యక్తిగతంగా జీవితాన్ని ఎంతో సమన్వయం చేస్తూ ముందుకు సాగిపోతున్న శ్రీయ ఆండ్రూ కోశ్చీవ్ అని విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఎంతో రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

సినిమాల విషయానికి వస్తే శ్రీయ ప్రధాన పాత్రలో కాకపోయినా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక శ్రీయ వ్యక్తిగత విషయానికొస్తే2018 లో తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియో చూసిన అభిమానులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.పెళ్లి చేసుకున్న శ్రియ ఇంతవరకు తాను ప్రెగ్నెంట్ అని అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోలేదు.

ఈ క్రమంలోనే తన బిడ్డతో కలిసి ఆడుకున్నటువంటి వీడియోను షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

శ్రేయ షేర్ చేసిన ఈ వీడియోలో తానుగర్భవతిగా ఉన్నప్పటి ఫోటో లు కూడా కనిపించాయి.ఇలా శ్రేయ ఉన్నఫలంగా తన బిడ్డను ఎత్తుకుని ఆడిస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు శ్రీయ మామూలుది కాదు ఇన్నిరోజులు ఈ విషయాన్ని దాచి పెట్టింది అంటూ కామెంట్ చేయడం మరికొందరు ఈ దంపతులకు శుభాకాంక్షలను చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలోకీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube