మందు బాబులకు షాక్.. మూతపడనున్న వైన్ షాపులు.. ఎప్పుడంటే.. ?

దేశంలో పెట్రోల్ రేటు పెరిగినా ఫర్వాలేదు.రెండు రోజులు కరెంట్ లేకున్నా బాధలేదు.

 Shock To Alcohol Addicts Wine Shops To Be Closed-TeluguStop.com

అంతెందుకు సమయానికి తిండి లేకున్నా ఏం కాదు.కానీ ఒక్క గంట వైన్ షాపులు బంద్ ఉంటే మాత్రం అస్సలు ఆగలేరు.

కట్టుకున్న పెళ్లాం పోయినా బాధపడరు కానీ మందు దొరకకుంటే మాత్రం సర్వం కోల్పోయిన ఫీలింగ్‌తో మందుబాబుల ముఖాలు మాడిపోతాయి.ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.

 Shock To Alcohol Addicts Wine Shops To Be Closed-మందు బాబులకు షాక్.. మూతపడనున్న వైన్ షాపులు.. ఎప్పుడంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయట.

అర్రే ఈ మాటవినగానే గుండెలో గునపం గుచ్చుకున్నట్లు అవుతుంది కదా! అసలు తెలంగాణకు వచ్చే ఆదాయంలో ప్రముఖ భాగం ఈ మందుబాబుల నుండే.

అలాంటి కిక్కిచ్చే అమృతాన్ని అమ్మే షాపులను ఎందుకు మూతవేస్తారనే అనుమానం వచ్చింది కదా అయితే వినండి.రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం ఉండనుందని అధికారులు చెబుతున్నారు.

ఇలా మార్చి 12వ తేది సాయంత్రం 4 గంటల నుంచి 14వ తేది 4 గంటల వరకూ మందు షాపులు బంద్ ఉంచాలని అబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసిందట.అదీగాక కౌంటింగ్ రోజున ఉదయం 6 గంటల నుండి ఆ లెక్కలు ముగిసే వరకూ మద్యం అమ్మకాలు నిషేధిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

మరి మందు బాబులు ఈ రెండు రోజులు మీ లెక్కలు మీకు ఉంటాయిగా ఇంకెందుకు ఆలస్యం ప్రొసిడ్.

#Closed #MLC Elections #Wine Shops #Telangana #Alcohol Addicts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు