Groom Kunal : వరుడికి పెళ్ళికి ముందే షాక్... సెలూన్ కు వెళ్లి, బయటకు వచ్చి చూసేసరికి మాయం!

Shock Before The Wedding Of The Groom He Went To The Salon, And When He Came Out, He Was Devastated , Bride Groom, Marriage, Wedding, Salon, Viral News, Funny News

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటూ వుంటారు.జీవితంలో అదొక మధుర జ్ఞాపకంలాగా మిగిలిపోవాలని ఎవరు కోరుకోరు? ఇక పెళ్లి వేడుకల విషయంలో దాదాపుగా ఎవ్వరూ తగ్గరు.తమకి ఉన్నంతలో చాలా ఆర్భాటంగా జరుపుకుంటూ వుంటారు.వధూవరులైతే పెళ్ళికి ఓ నెల రోజుల ముందే తమ అందమైన ఫోకస్ పెడతారు.వధువైతే వారానికి ఒక్కసారైనా బ్యూటీ పార్లర్ కి వెళ్తుంది.వరుడు సాధారణంగా ఓ రెండు రోజుల ముందు సెలూన్ కి వెళ్లి అందంగా తయారవుతాడు.

 Shock Before The Wedding Of The Groom He Went To The Salon, And When He Came Out-TeluguStop.com

ఎందుకంటే పెళ్లి వేడుకరోజు ఫోటో షూట్ ఉంటుంది కదా.

ఇక్కడ కూడా ఓ వరుడు రెండు రోజుల ముందు ఓ సెలూన్ కి వెళ్ళాడు.ఈ క్రమంలో ఫేషియల్, కటింగ్, బ్లీచింగ్ చేయించుకున్నాడు.తీరా బయటకు వెళ్లి చూసేసరికి అత్తవారు పెట్టిన గొలుసు మెడలో కనిపించకుండా పోయింది.షాకైన యువకుడు వెంటనే సెలూన్‌కు వెళ్లి, సదరు బార్బర్ ని అడిగాడు.దానికి అతడు తనకేమి తెలియదని, కావాలంటే ఇక్కడ తనిఖీ చేసుకోమని కోరాడు.

దాంతో వరుడు మొత్తం వెతికాడు.చైన్ ఎక్కడా కనిపించలేదు.

దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వారు వచ్చి చూడగా అసలు విషయం బయట పడింది.

ఈ విషయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరగగా తాజాగా వెలుగు చూసింది.కునాల్ అనే యువకుడు గురువారం అనగా ఈరోజు వివాహం చేసుకోబోతున్నాడు.ఈ నేపథ్యంలో ఇలా జరిగింది.పైగా సెలూన్ వాడు రూ.3,100 ఛార్జ్ చేసాడట.కాగా ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

డబ్బులు సరిపోలేదని అనుకున్నాడేమో మరి, చైన్ దొబ్బేసాడు… అని ఒకరంటే… జాగ్రత్త పెళ్లి కొడుకుల్లారా! ఇకనుండి సెలూన్ కి వెళ్ళేటప్పుడు ఇలా గొలుసులు వంటివి వేసుకోవద్దు అని కొంతమంది సూచిస్తున్నారు.కాగా పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube