“ఉప్పెన” సినిమా ద్వారా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తన రెండవ సినిమాను చేస్తుండగా మూడవ సినిమాను కూడా ప్రారంభించారు.
ఈ క్రమంలోనే దర్శకుడు గిరీషయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన మూడవ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో మెగా హీరో సరసన నటించడం కోసం హీరోయిన్ పాత్రలో కేతికశర్మ నటిస్తున్నారు.
కేతిక శర్మ ఇదివరకే “లక్ష్య”, “రొమాంటిక్” వంటి చిత్రాలలో నటిస్తోంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఒకరు కేతికశర్మ కాగా మరొక హీరోయిన్ కోసం దర్శకులు పలువురిని సంప్రదించారు.

ఈ క్రమంలోనే వైష్ణవ్ సరసన ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో నటించడం కోసం దర్శకుడు శోభితా రానాను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ నటి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.ఇంత పెద్ద సినిమాల్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని, తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నానని శోభితా రానా తెలియజేశారు.ఇప్పటివరకు ఈ బ్యూటీ కన్నడ, హిందీ భాషలలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
తొలిసారిగా తెలుగు తెరపై మెగా హీరో సరసన సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.