పెళ్లి రోజు మర్చిపోయిన షోయబ్..చివరికి..!?

భారత దేశానికి చెందిన టాప్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ని 11 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్తాన్ కి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ షోయబ్ మాలిక్.అయితే తాజాగా షోయబ్ మాలిక్ చాలామంది మగవారు చేసే చిన్న తప్పు ను తాను కూడా చేశారు.ఎందుకంటే అతను కూడా ఓ సగటు భర్త కాబట్టి.ఇంతకీ షోయబ్ మాలిక్ చేసిన తప్పేంటి అంటే అతడి పెళ్లిరోజు మర్చిపోవడం.అయితే ఈ విషయాన్ని కవర్ చేయడానికి తాజాగా అతను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.ఇందులో భాగంగా.

 Shoaib Forgets Wedding Day Eventually-TeluguStop.com

ఊప్స్ పొరపాటున తప్పు జరిగిపోయింది ఒక రోజు ఆలస్యంగా తనకు చెప్పడం అలవాటు అయ్యింది.ఐ లవ్ యు సానియా మీర్జా టు ది మూన్ అండ్ బ్యాక్ బేగం అంటూ షోయబ్ మాలిక్ తెలిపాడు.దాంతో పాటు చివర్లో లవ్ ఎమోజి ని యాడ్ చేస్తూ కన్ను కొట్టే ఏమోజి ను పొందుపరిచాడు.

1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన షోయబ్ మాలిక్ షార్జాలో వెస్టిండీస్ తో మొదటి మ్యాచ్ ఆడాడు.ఇకపోతే భారతదేశం నుంచి స్టార్ టెన్నిస్ ప్లేయర్ గా ఎదిగిన సానియామీర్జా అతడు చాలాకాలంగా ప్రేమించి ఎట్టకేలకు ఏప్రిల్ 12, 2010 లో ఇరువురి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.

 Shoaib Forgets Wedding Day Eventually-పెళ్లి రోజు మర్చిపోయిన షోయబ్..చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సానియా మీర్జా తన పెళ్లి రోజును పురస్కరించుకొని ఏప్రిల్ 12న విషెస్ తెలపింది.తన భర్తతో కలిసి ఉన్న ఫోటో లను జత చేస్తూ తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా తెలపంది.తన కష్టసుఖాలలో మంచిచెడులలో అన్నింటా తోడు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మనకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.ఇంకా తాను చాలా సంవత్సరాలు నిన్ను విసిగించాలి.ఇన్షా అల్లా 11 సంవత్సరాలు అంటూ తన ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.

#Twitter #Social Media #@MirzaSania #Shoiab Malid #Sania Mirza

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు