షోయబ్ అక్తర్ చేసిన పనికి మండిపడుతున్న పాక్ ఫ్యాన్స్.. ఇంతకీ ఏం చేశాడంటే..?

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అయిన షోయబ్‌ అక్తర్‌ చేసిన ఓ పని ఇప్పుడు పాక్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.ఇందుకు కారణం అక్తర్.

 Shoaib Akhtar's Work Infuriates Pakistani Fans .. What Has He Done So Far .. Soy-TeluguStop.com

టీమిండియా దిగ్గజ ఆటగాళ్లైన సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌కు సరదాగా ఒళ్లు పట్టాడమే! ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ కోసం దుబాయ్‌కి విచ్చేసిన అక్తర్ సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌లతో సరదాగా సమయం గడిపాడు.అంతేకాదు, వారిద్దరికీ ఒళ్లు పట్టి వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.అలాగే ఈ ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.‘క్రికెట్‌లో ఉత్తమ ఆటగాళ్లకే అత్యుత్తమ ఆటగాళ్లైన గావస్కర్‌, కపిల్‌ దేవ్‌, జహీర్‌ అబ్బాస్‌ లాంటి దిగ్గజాలతో సరదాగా సమయం గడుపుతున్నా’ అంటూ ట్వీట్‌ చేశాడు.

అయితే ఇది పాక్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.నువ్వు ఒక సీనియర్ ఆటగాడివి.అందులోనూ ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్‌బౌల‌ర్‌వి.అలాంటిది ఓ జీతగాడిలా ఒళ్లు పట్టడం ఏంటి? అని పాక్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.డబ్బుల కోసం ఏదైనా చేస్తావా అంటూ మరికొందరు దుమ్మెత్తిపోస్తున్నారు.కొందరు అభిమానులు మాత్రం ఈ ఫొటోలపై పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.భారత్, పాక్ క్రికెటర్లు ఇలా ఏ గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుండు అని కామెంట్లు పెడుతున్నారు.

Telugu Latest, Netizens, Pakistan Fans, Soyab Akthar-Latest News - Telugu

నిజానికి షోయబ్ అక్తర్ ఇటీవల కాలంలో భారతీయ ఆటగాడు హర్భజన్‌తో మాటల యుద్ధానికి తెరలేపాడు.గతం నుంచే వీరి మధ్య వైరం ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ట్వీట్స్ ద్వారా వీరి మధ్య శత్రుత్వం మరింత పెరిగిపోతోంది.ఒకరిపై మరొకరు ఘాటుగా కామెంట్లు చేస్తూ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.

ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ షోయబ్ అక్తర్ ని సరదాగా పొగిడారు.అక్తర్ బంతితో హర్ట్ చేస్తాడు కానీ అతడి చేతులు మంచి షోల్డర్ మసాజ్ ఇవ్వగలవు అని తనదైన శైలిలో పొగిడాడు సునీల్ గవాస్కర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube