భారతీయులు మంచివాళ్ళు అంటున్న రావల్పిండి ఎక్స్ ప్రెస్  

Shoaib Akhtar Opens Up On Indian Media And Natives - Telugu Cricket, Indians, Pakisthan,

రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పాకిస్తాన్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి షోయబ్ అక్తర్.క్రికెట్ కెరియర్ లో చాలా దూకుడుగా ఉండే అక్తర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కాస్తా తన స్వభావం మార్చుకున్నట్లు కనిపిస్తుంది.

 Shoaib Akhtar Opens Up On Indian Media And Natives

ప్రతి విషయం సానుకూలంగా స్పందించడంతో పాటు, ముఖ్యంగా ఇండియా విషయంలో ఇప్పటికప్పుడు సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నాడు.అలాగే పాకిస్తాన్ లో ఉన్న హిందువుల గురించి కూడా తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాడు.

ఇండియాలో ముస్లింలు ఉన్నంత సేఫ్ గా పాకిస్తాన్ లో హిందువులు లేరని ఆ మధ్య వ్యాఖ్యలు చేసిన అక్తర్ తాజాగా భరత్ పై ప్రశంసలు కురిపించారు.

భారతీయులు మంచివాళ్ళు అంటున్న రావల్పిండి ఎక్స్ ప్రెస్-General-Telugu-Telugu Tollywood Photo Image

న్యూస్ చానల్స్ చూస్తూ ఉంటే భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పుడే యుద్ధం వస్తుంది అన్నట్లు ఫోకస్ చేస్తూ ఉంటారని, నిజానికి ఇండియాలో అలాంటి పరిస్థితి ఎక్కడ లేదని అన్నారు.

భారతీయులు ఎప్పటికి యుద్ధాన్ని కోరుకోరని అన్నాడు.నేను ఇండియా మొత్తం తిరిగాను అక్కడి ప్రజలు పాకిస్తాన్ వారిని సోదరులుగా చూస్తూ ఎప్పుడు స్వాగతిస్తూనే ఉంటారు.

భారతీయులు మంచివాళ్ళు పాక్ తో కలిసి పనిచేయడానికి వారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు.యుద్ధాన్ని ఎప్పటికి కోరుకోరు అని వ్యాఖ్యానించారు.

అయితే భారత్ పురోగతి పాకిస్తాన్ తో ముడిపడి ఉందని నా నమ్మకం.రెండు దేశాల మధ్య మంచి సహ్రుద్భావం వాతావరణం ఏర్పాడాలని అనుకుంటున్నా అని అన్నారు.

అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలని సోషల్ మీడియాలో భారతీయులు విపరీతంగా సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.అక్తర్ చెప్పింది ముమ్మాటికి వాస్తవం అని అంటున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు