శివశంకర్ మాస్టర్ సేవలు మరువలేనివి.. హీరో కార్తీక్ వైరల్ కామెంట్స్!

Shivshankar Master Services Unforgettable Hero Karthik Comments Viral

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా జాతీయ పురస్కారాలను అందుకుని తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో ఓ అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సుమారు ఎనిమిది వందల చిత్రాలకు పైగా నృత్య దర్శకుడిగా పని చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో పురస్కారాలను అందుకున్నారు.

 Shivshankar Master Services Unforgettable Hero Karthik Comments Viral-TeluguStop.com

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి ఆదివారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అధిక మొత్తంలో ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతిచెందారు.

 Shivshankar Master Services Unforgettable Hero Karthik Comments Viral-శివశంకర్ మాస్టర్ సేవలు మరువలేనివి.. హీరో కార్తీ వైరల్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శివ శంకర్ మాస్టర్ మరణించిన వార్తను తెలుసుకున్న పలువురు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.ఈ సందర్భంగా తమిళ హీరో కార్తీ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ తనతో ఉన్న అనుభవం గురించి పంచుకున్నారు.

Telugu Karthik, Shivashanker-Movie

ఈ సందర్భంగా కార్తీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.శివ శంకర్ మాస్టర్ భారతీయ సినీ పరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం ఆయన మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.ఇక మాస్టర్ మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించడంతో పలువురు ఈయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

#ShivaShanker #Karthik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube