రూపాయ్ కే లీటర్ పెట్రోల్.. బారులు తీరిన వాహనదారులు..!

లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు అటు ఇటు ఉన్న ఈ టైం లో లీటర్ పెట్రోల్ 1 రూపాయ్ అంటే ఎలా ఉంటుంది.వహనదారులంతా బారులు తీరి పెట్రోల్ కొట్టించుకోరు.

 Shivsen Distribute Petrol At Rupees 1 Per Litre In Dombivli-TeluguStop.com

అవసరమైతే గంట కాదు రెండు మూడు గంటలైనా సరే వెయిట్ చేసి మరి పెట్రోల్ కొట్టించుకుంటారు.అంతా బాగుంది కాని అసలు ఇంతకీ రూపాయికి పెట్రోల్ ఎవరు ఇస్తున్నారు అంటే మహరాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే పుట్టినరోజు సందర్భంగా శివసేన మద్ధతుదారులు రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు.

డోంబివిలి ఎమైడీసీ ప్రాంతంలో ఉస్మా పెట్రోల్ పంపు వద్ద డొంబివిలి యువసేన నేత యోగేష్ మహాత్రే వాహనదారులకు 1 రూపాయికె పెట్రోల్ అందించారు.

 Shivsen Distribute Petrol At Rupees 1 Per Litre In Dombivli-రూపాయ్ కే లీటర్ పెట్రోల్.. బారులు తీరిన వాహనదారులు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు సమాచారం.100కి దగ్గరగా ఉన్న లీటర్ పెట్రోల్ కేవలం రూపాయ్ కే అనగానే ఆ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు పెట్రోల్ పోయించుకునేందుకు క్యూ కట్టారు.ఆ క్యూ రోడ్డు మీదకు వచ్చేసింది.

అక్కడే కాదు అంబర్ నాథ్ లో శివసేన నేత అరవింద్ వాలేకర్ కూడా 50 రూపాయలకే లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు.వింకో నాకా పెట్రోల్ పంపు లో ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు లీటర్ పెట్రోల్ 50 రూపాయలకే పంపిణీ చేశారు.

ఆదిత్యా థాకరే పుట్టినరోజు సందర్భంగ పెట్రోల్ రేటు తగ్గించి తమ నాయకుని మీద అభిమానం చాటుకున్నారు.

#Rupees Litre #Shivsen #Distribute #Dombivli #Petrol

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు