ఎట్టకేలకు నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన దొరసాని  

Shivatmika Rajasekhar Signs Her Second Movie - Telugu Dorasani Movie, Jeevitha Rajasekhar, Shivatmika Rajasekhar, Telugu Movie News

యాంగ్రీ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో రాజశేఖర్ కూతురిగా శివాత్మికా రాజశేఖర్ గతేడాది దొరసాని అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.ఆ సినిమాలో ఆమె యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయంటే అమ్మడి యాక్టింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Shivatmika Rajasekhar Signs Her Second Movie

ఇక ఆ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫిలిం నగర్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా తాజాగా శివాత్మికా రాజశేఖర్ తన రెండో సినిమాకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం(జనవరి 20) జరగనున్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.దుర్గ నరేష్ గుత్తా అనే దర్శకుడి డైరెక్షన్‌లో యంగ్ హీరో అరుణ్ ఆదిత్‌తో రొమాన్స్ చేసేందుకు శివాత్మిక రెడీ అవుతోందట.

ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించనుంది.

ఈ సినిమాను ఎస్‌కెఎస్ బ్యానర్‌ ప్రొడ్యూస్ చేస్తోంది.మొత్తానికి దొరసాని తన రెండో సినిమాను ఓకే చేసిందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు