అక్క కంటే స్పీడ్ గా ఉన్న రాజశేఖర్ చిన్న కూతురు... నాలుగో సినిమాకి గ్రీన్ సిగ్నల్  

Shivathmika Rajashekar signs her Fourth film, Tollywood, South Cinema, Rajasekhar, Shivani Rajasekhar, Dorasani Movie - Telugu Dorasani Movie, Rajasekhar, Shivani Rajasekhar, Shivathmika Rajashekar, South Cinema, Tollywood

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కూతుళ్ళు ఇద్దరూ హీరోయిన్స్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.పెద్ద కూతురు శివాని ముందుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె చేసిన సినిమా మధ్యలో ఆగిపోయింది.

TeluguStop.com - Shivathmika Rajashekar Signs Her Fourth Film

దీంతో ఆమె ఎంట్రీ కాస్తా లేట్ అయ్యింది.అయితే చిన్న కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో తెరంగేట్రం చేసింది.

మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

TeluguStop.com - అక్క కంటే స్పీడ్ గా ఉన్న రాజశేఖర్ చిన్న కూతురు… నాలుగో సినిమాకి గ్రీన్ సిగ్నల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మూడో సినిమాని అరుణ్ అదిత్ తో కలిసి చేస్తుంది.విధి విలాసం టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అయితే రెండో సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఈ అమ్మడు వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది.ఇప్పటికే కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి శివాత్మిక రెడీ అయిపొయింది.

అక్కడ ఒక సినిమాకి కమిట్ అయ్యింది.ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా తన నాలుగో సినిమాని కన్ఫర్మ్ చేసుకుంది.

లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో సీనియర్ స్టంట్ కొరియోగ్రాఫర్ విజయ్ కుమారుడు యువ హీరో రాహుల్ విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న సినిమాలో శివాత్మిక హీరోయిన్ గా ఖరారైంది.ఫ్యాషన్ డిజైనింగ్ అభిరుచితో ఉండే మెడికోగా శివత్మిక ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం.

ఆమె తన పాత్ర కోసం పర్ఫక్ట్ మేకోవర్ ట్రై చేస్తున్నారట.హర్ష పులిపాక ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన త్వరలో రానుంది.అక్క కంటే ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా కూడా శివాత్మిక వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది.

మరి శివాని తన లక్ ని ఎలా మార్చుకుంటుందో అనేది వేచి చూడాలి.

#Rajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు