ఆధ్యాత్మిక సేవలో శివాత్మిక రాజశేఖర్.. చీరకట్టులో మెరిసిపోతోందిగా?

తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి జీవిత, హీరో రాజశేఖర్( Rajashekar ) ల రెండవ కుమార్తె శివాత్మిక రాజశేఖర్( shivathmika rajashekar ) గురించి మనందరికీ తెలిసిందే.జీవిత, రాజశేఖర్ ల కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Shivathmika Rajashekar Cuteness Overload In Traditional Saree Beautiful Photos G-TeluguStop.com

ఈమె 2019లో విడుదల అయిన దొరసాని ( Dorasani movie )సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శివాత్మిక అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కాగా శివాత్మిక తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.కాగా శివాత్మిక రాజశేఖర్ సినిమాలోని నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఇప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు తరచూ హాట్ ఫోటో షూట్( Hot photo shoot ) లు చేస్తూ కుర్రకారుకు అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.ఇటీవల కాలంలో తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టూ బ్యాక్ గ్లామర్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు అందాలు కనువిందు చేస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆథ్యాత్మిక సేవలో పాల్గొని కనువిందు చేసింది.

తాజాగా ఈమె తిరువన్నమలై ఆలయాన్ని సందర్శించింది.దర్శనం అనంతరం బయటకు వస్తూ ఆమె దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.

ఫైనల్లీ మ్యాజికల్‌ టెంపుల్‌ తిరువన్నమలై టెంపుల్‌ని సందర్శించాను.మీకు గుడ్‌ వైబ్స్ పంపిస్తున్నాను.

అని రాసుకొచ్చింది శివాత్మిక.కాగా ఆ ఫోటోలలో లైట్‌ పింక్‌ కలర్‌ శారీ కట్టుకొని పద్దతిగా చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది.

ఇక అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చీరకట్టులో సూపర్ గా ఉన్నావు అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే శివాత్మిక రాజశేఖర్ సినిమాల విషయానికి వస్తే.

ఇటీవల విడుదల అయిన రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇందులో రాఘవరావు కూతురుగా అలరించి, తన అద్భుతమైన నటనతో మెప్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube