తెలుగు సినిమా నటుడు డాక్టర్ రాజశేఖర్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన తెలుగు, తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు.1991లో మరో నటి జీవితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈయనకు ఇద్దరు కూతుళ్లు ఉండగా అందులో శివాత్మిక సినీ రంగ ప్రవేశం చేసింది.ఆమె తొలిసారి తెలుగు సినిమాలో హీరోయిన్ గా పరిచయమయ్యింది.
2019లో విడుదలైన తెలుగు సినిమా దొరసానిఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తొలిసారి హీరోగా పరిచయం అవ్వగా, రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఈ సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఓ సినిమాలో శివాత్మిక నటిస్తుందని తెలుస్తుంది.

ఇక మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన కప్పేల అనే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.ఇక ఈ సినిమాలో శివాత్మిక పాత్ర బాగుంటుందని ఈ సినిమా చూసినా నిర్మాత నాగ వంశీ అనుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథను శివాత్మిక కు వినిపించగా తనకు నచ్చగా ఆమె ఇంకా ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక ఈ సినిమాలో నిర్మాత నాగ వంశీ మలయాళంలో నటించిన నటులు శ్రీనాథ్ బసి, రోషన్ మాథ్యూస్ పాత్రల్లో తెలుగు నటులు విశ్వక్ సేన్, నవీన్ చంద్ర లను ఎన్నుకున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే శివాత్మిక కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా హర్ష పులిపాక దర్శకత్వంలో వస్తున్న మరో సినిమాలో నటిస్తుంది.