రాజశేఖర్ చిన్న కూతురు రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్

ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ అంటే అందరూ జీవిత, రాజశేఖర్ పేర్లు చెబుతారు.రాజశేఖర్ ఎక్కడికి వెళ్ళిన తన భార్య, పిల్లలు లేకుండా వెళ్లరు.

 Shivathmika Rajasekhar Her Second Film-TeluguStop.com

అయితే ఈ విషయంలో రాజశేఖర్ మీద నెగిటివ్ ట్రోల్స్ వచ్చిన కూడా తన కుటుంబానికి అతను ఇచ్చే ప్రాముఖ్యం వేరే ఇతర హీరోలు ఇస్తారో, ఇవ్వరో కూడా తెలియదు.ఇక సినిమా ఇండస్ట్రీలో తన వారసత్వంతో ఎవ్వరు చేయని విధంగా తన కూతుళ్ళు ఇద్దరిని హీరోయిన్స్ గా పరిచయం చేసిన ఘటన కూడా రాజశేఖర్, జీవితలకి ఉంటుంది.

పెద్ద కూతురు శివాని, హిందీ 2 స్టేట్స్ రీమేక్ లో కెరియర్ స్టార్ట్ చేసిన ఆ సినిమా ఏవో కారణాల వలన ఆగిపోయింది.అయితే ఇంతలో రెండో కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంటరు ఇచ్చేసింది.

మొదటి సినిమా ఎవరేజ్ అయిన కూడా శివాత్మిక నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడంతో ఆమెకి వెంటనే అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.

అయితే ఏవో కారణాల వలన వెంటనే అవకాశం అందుకోలేదు.ఇదిలా ఉంటే తాజాగా శివాత్మిక మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అది కూడా కృష్ణవంశీ దర్శకత్వంలో.కృష్ణవంశీ రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో మరాఠీ సినిమా నట సామ్రాట్ ని రంగమార్తాండ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.

ఇందులో రమ్య, ప్రకాశ్ రాజ్ కూతురి పాత్రలో శివాత్మిక కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై విశాఖలో మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది.

ఈ సినిమాని కృష్ణవంశీ చాలా ఇష్టపడి కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో తెరకెక్కిస్తున్నారు.మరి ఈ సినిమాలో శివాత్మిక పాత్ర ఎలా ఉంటుంది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube