అందుకే సుశాంత్ ఆత్మహత్య అంటూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు, ఖండించిన సుశాంత్ సోదరుడు  

Shivasena MP sensational comments on Sushant\'s father, Sushanthi Singh Rajputh, KK Singh, Siva Sena, Sanjay Rauth, Mumbai Police, Bihar Police, CBI, Nepotisam - Telugu Bihar Police, Cbi, Kk Singh, Mumbai Police, Nepotisam, Sanjay Rauth, Siva Sena, Sushanthi Singh Rajputh

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆత్మహత్య ఘటన పై ఇప్పుడు రాజకీయ రచ్చ నడుస్తుంది.ఇప్పటికే సుశాంత్ మృతి పై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తూ అనేక ఆరోపణలు చేయగా ఇప్పుడు తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - Shivasena Mp Sensational Comments On Sushants Father

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

సుశాంత్ మృతి కి నేపోటిజం కారణం అని,కాదు మాఫియా అని,మరొకరు గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణం ఇలా పలు కోణాలు వెలుగులోకి రాగా, ఇప్పుడు తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

TeluguStop.com - అందుకే సుశాంత్ ఆత్మహత్య అంటూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు, ఖండించిన సుశాంత్ సోదరుడు-General-Telugu-Telugu Tollywood Photo Image

సుశాంత్ తండ్రి కేకే సింగ్ రెండో పెళ్లి చేసుకోవడం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.

సీరియల్స్ ద్వారా కెరియర్ ప్రారంభించిన సుశాంత్ హీరో గా ఎదిగి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో స్థిరపడుతున్న సమయంలో ఇలా ఆత్మహత్య తో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు.అయితే అతడి మృతి పై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో శివసేన ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సుశాంత్ కేసుకు సంబంధించి తోలి నుంచి ముంబై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తుండగా బీహార్ సర్కార్ చొరవ తో ఈ కేసు కాస్త సీబీఐ కి అప్పగించింది కేంద్రం.

అప్పటి నుంచి కూడా శివసేన నేతలు ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇప్పటికే సుశాంత్ కేసుకు సంబంధించి అతడి మృతి వెనుక గొప్ప సీఎం కుమారుడు ఉన్నాడు అని బేబీ పెంగ్విన్ అని సంబోధిస్తూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా ఒక్కొక్కరు శివసేన నేతలు సుశాంత్ మృతి పై భిన్న వ్యాఖ్యలు చేస్తుండడం మరిన్ని అనుమానాలు కలిగిస్తుంది.

సుశాాంత్ తన తండ్రిని ఎన్నిసార్లు కలిశారో చెప్పాలంటూ రౌత్ ప్రశ్నించారు.సుశాంత్ చనిపోయిన 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటికి వచ్చారని, సుశాంత్ ముంబయిలో చనిపోతే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ ఆయన ఆరోపించారు.

అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై సుశాంత్ సోదరుడు నీరజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు అంటూ రౌత్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని,దీనిపై ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఒకవేళ రౌత్ క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.జూన్ 14 న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని కలచివేసిన సంగతి తెలిసిందే.

అతడి మృతి తో బాలీవుడ్ లో నేపోటిజం అన్న అంశం తెరపైకి రావడం తో పలువురు నటులు స్పందిస్తూ తమ అనుభవాలను పంచుకున్నారు.

#Nepotisam #Siva Sena #Sanjay Rauth #KK Singh #Bihar Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shivasena Mp Sensational Comments On Sushants Father Related Telugu News,Photos/Pics,Images..