ఆ ఫోటో చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు.. పునీత్ రాజ్ కుమార్ అన్న కామెంట్స్ వైరల్!

Shivaraj Kumar Emotional Comments About His Brother Puneeth Raj Kumar

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అభిమానులను ఎంతో బాధ పెట్టిన సంగతి తెలిసిందే.పునీత్ మరణాన్ని ఆయన ఫ్యాన్స్ తో పాటు తోటి సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోవడం లేదు.

 Shivaraj Kumar Emotional Comments About His Brother Puneeth Raj Kumar-TeluguStop.com

కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణించి నెల రోజులైంది.పునీత్ ను తలచుకుంటూ ఆయన ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతుండటం గమనార్హం.

తాజాగా పునీత్ అన్న శివరాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

 Shivaraj Kumar Emotional Comments About His Brother Puneeth Raj Kumar-ఆ ఫోటో చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు.. పునీత్ రాజ్ కుమార్ అన్న కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమ్ముడి మరణ వార్తను తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.

పునీత్ రాజ్ కుమార్ తన పక్కనే ఉన్నట్టు తనను ప్రేమతో శివన్నా అని పిలుస్తున్నట్టు భావిస్తున్నానని శివరాజ్ కుమార్ వెల్లడించారు.రోజులు క్షణాలలా గడిచిపోతున్నాయని పునీత్ రాజ్ కుమార్ మృతి బాధ నుంచి బయటపడటానికి ప్రస్తుతం తాను పనిపై దృష్టి పెడుతున్నానని శివరాజ్ కుమార్ అన్నారు.

తాను ఎక్కడికి వెళ్లినా తమ్ముడి ఫోటోలే కనిపిస్తున్నాయని శివరాజ్ కుమార్ వెల్లడించారు.అలా తమ్ముడి ఫోటోలు తనకు కనిపించిన ప్రతిసారి కన్నీళ్లు ఆగడం లేదని శివరాజ్ కుమార్ అన్నారు.

ఫోటోలను చూడకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు.కొంత సమయం తర్వాత తాను తేరుకుంటున్నానని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.

లైఫ్ లో ఎవరైనా ఎప్పుడైనా భూమిని వదలాల్సిందే అనే సత్యాన్ని తెలుసుకున్నానని శివరాజ్ కుమార్ అన్నారు.

Telugu Shivaraj Kumar-Movie

ధైర్యంగా ఉండటానికి తాను ప్రయత్నిస్తున్నానని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.తన తమ్ముడి ఫ్యామిలీకి చేతనైనంత సహాయం చేస్తానని శివరాజ్ కుమార్ కామెంట్లు చేశారు.పునీత్ రాజ్ కుమార్ బాటలో పయనిస్తూ కొంతమంది నేత్రదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.

పునీత్ మరణించినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కొనసాగే విధంగా పునీత్ కుటుంబ సభ్యులు చర్యలు చేపడుతున్నారు.

#Shivaraj Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube